Thursday, 16 December 2021

పుష్ప సినిమాకు తెలంగాణ గవర్నమెంట్ ఆఫర్.. 5 షోలకు అనుమతి

ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. ఆయన తొలి పాన్ ఇండియా మూవీ '' థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అయింది. రేపు (డిసెంబరు 17) ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రీమియర్ షోస్, స్పెషల్ షోస్ కోసం జనం ఎగబడుతుండగా బన్నీ అభిమానుల కోసం తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా థియేటర్స్‌లో ఒక రోజుకు నాలుగు షోస్ ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే పెద్ద సినిమాలు రిలీజ్ అయిన సందర్భాల్లో ప్రత్యేకంగా మరో షోకి అనుమతి ఇస్తుండటం చూస్తున్నాం. తాజాగా అల్లు అర్జున్ 'పుష్ప' విషయంలోనూ అదే జరిగింది. తెలంగాణలో ఐదో షో ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో రద్దీని బట్టి శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్‌లలో ‘పుష్ప’ ఐదు షోలు ప్రదర్శించబడనున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అందులో మొదటి భాగమైన 'పుష్ప ది రైజ్'ని రేపు రిలీజ్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ భారీ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటించగా.. యాంకర్ అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్‌ బాణీలు కట్టారు. ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్‌ లభించింది. ‘పుష్ప’ రన్‌ టైమ్‌ 179.51 నిమిషాలు. తెలుగుతో పాటు తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3GJ2Ceg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...