Thursday, 16 December 2021

అఖండ 14 డేస్ కలెక్షన్స్.. థియేటర్లలో బాలయ్య హవా! కోట్లలో లాభం..

సినీ ఇండస్ట్రీని కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. దాదాపు రెండేళ్లు థియేటర్ల గేట్లు మూసుకుపోగా రీసెంట్‌గా తిరిగి బొమ్మ పడింది. ఈ క్రమంలో ముందుగా థియేటర్లలోకి వచ్చిన పెద్ద సినిమా అఖండ. బాలకృష్ణ- బోయపాటి క్రేజీ కాంబోలో హాట్రిక్ మూవీగా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చి సత్తా చాటుతోంది. తొలివారంలో కలెక్షన్ల ప్రవాహం పారించిన ఈ మూవీ రెండో వారంలో కాస్త జోరు తగ్గించింది. నిన్నటితో 14 రోజుల రన్ పూర్తి చేసుకొని 10 కోట్లకు పైగా లాభాలతో హవా నడిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 14వ రోజు రిపోర్ట్ చూస్తే.. నైజాం- 16 లక్షలు సీడెడ్‌- 10 లక్షలు ఉత్తరాంధ్ర- 5 లక్షలు ఈస్ట్ గోదావరి- 3 లక్షలు వెస్ట్ గోదావరి- 4 లక్షలు గుంటూరు- 3 లక్షలు కృష్ణా- 2 లక్షలు నెల్లూరు- 2 లక్షలు మొత్తంగా 14వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 45 లక్షలు షేర్ షేర్ రాగా 75 లక్షల గ్రాస్ వసూలయింది. మొత్తం 14 రోజుల అఖండ కలెక్షన్ వివరాలు నైజాం- 18.25 కోట్లు సీడెడ్‌- 13.97 కోట్లు ఉత్తరాంధ్ర- 5.66 కోట్లు ఈస్ట్ గోదావరి- 3.80 కోట్లు వెస్ట్ గోదావరి- 3.13 కోట్లు గుంటూరు- 4.40 కోట్లు కృష్ణా- 3.32 కోట్లు నెల్లూరు- 2.40 కోట్లు మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి 54.93 కోట్లు షేర్, 90 కోట్లు గ్రాస్ వచ్చింది. అలాగే కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో 4.60 కోట్లు, ఓవర్సీస్‌లో మరో 5.20 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 64.73 కోట్లు షేర్, 112 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టి 10.73 కోట్ల రూపాయల లాభాలతో రన్ అవుతోంది. ఈ సినిమా సక్సెస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త జోష్ తీసుకొచ్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3m9OLWH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...