Friday, 17 December 2021

అఖండ 15 డేస్ కలెక్షన్స్: లాభాల బాటనే కానీ డ్రాప్! ఇప్పటివరకు బాలయ్య ఖజానా చూస్తే..

నందమూరి నటసింహం ఖాతాలో అఖండ రూపంలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 'అఖండ' విజయం సాధించింది. కరోనా ప్యాండెమిక్ సిచుయేషన్ తర్వాత వచ్చిన ఈ మూవీ.. విడుదలైన రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని కేవలం 8 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసేసింది. అయితే లాభాల బాటలోకి ఎంటర్ అయ్యాక ఈ సినిమా కలెక్షన్స్ క్రమంగా డ్రాప్ అవుతూ వస్తున్నాయి. తొలివారంలో కలెక్షన్ల ప్రవాహం పారించిన ఈ మూవీ రెండో వారంలో కాస్త జోరు తగ్గించి మూడో వారం లోకి ఎంటర్ అయింది. నిన్నటితో 15 రోజుల రన్ పూర్తి చేసుకొని 10 కోట్లకు పైగా లాభాలతో హవా నడిపిస్తోంది. 14వ రోజుతో పోల్చితే 15వ రోజు కలెక్షన్స్ 20% నుంచి 25% వరకు డ్రాప్ అయినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. 14వ రోజు 45 లక్షలు షేర్ వసూలు కాగా.. 15వ రోజుకు గాను తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 30 లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయని తెలిసింది. అఖండ సినిమాతో తన కెరీర్‌లో తొలిసారి 100 కోట్ల క్లబ్‌లో చేరారు బాలకృష్ణ. ఈ విజయం పట్ల ఎంతో ఆనందంగా ఉన్న ఆయన విజయవాడ అమ్మవారిని దర్శించుకొని, ఆ తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పటిదాకా అఖండ సినిమాకు 10 కోట్లకు పైగా లాభాలు వచ్చాయి. 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పటికి 64 కోట్లు రాబట్టింది. ఈ సినిమాలో బాలయ్య నటనకు గాను విమర్శకుల ప్రశంసలు దక్కడం విశేషం. బాలయ్య అందించిన ఈ విజయం తెలుగు సినీ పరిశ్రమకు పూర్వ వైభవాన్ని తీసుకురావడంలో ముందుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3q30Yxu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...