Friday, 17 December 2021

‘భీమ్లా నాయక్’ షూటింగ్‌లో పవన్ బైక్ రైడ్.. జనం రియాక్షన్.. వైరల్ అవుతున్న వీడియోలు

పవర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం భీమ్లా నాయ‌క్ షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. రానా మ‌రో హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కొత్త షెడ్యూల్‌ను వికారాబాద్ మ‌ద‌న్‌ప‌ల్లిలోని ఎల్ల‌మ్మ దేవాల‌యం వ‌ద్ద ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాల్గొన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌స్తున్నార‌ని తెలుసుకున్న అక్క‌డున్న ప్ర‌జ‌లు గుంపులు గుంపులుగా విచ్చేశారు. భారీ సంఖ్య‌లో అభిమానులు వ‌చ్చి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని అరుస్తూ నినాదాలు చేశారు. దాంతో ఆయ‌న కారు బ‌య‌ట‌కు వ‌చ్చి వారికి అభివాదం చేశారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. దీంతో పాటు ఆ సినిమాకు సంబంధించి మ‌రో వీడియో కూడా నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇంత‌కీ ఆ వీడియోలో ఏముందో తెలుసా? పోలీస్ డ్రెస్ వేసుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ బైక్‌ను రైడ్ చేస్తున్నారు. దాన్ని కారు నుంచి చిత్రీక‌రించిన అభిమాని ఒక‌రు నెట్టింట పోస్ట్ చేయ‌డంతో ఆ వీడియో కూడా తెగ వైర‌ల్‌గా మారింది. మ‌ల‌యాళ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్ చిత్రానికి తెలుగు రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రం భీమ్లా నాయ‌క్‌. వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌ల‌వుతుంది. సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య దేవ‌ర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్రముఖ ద‌ర్శ‌కుడు, ర‌చయిత త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాట‌ల‌ను అందించారు. అంతే కాకుండా లాలా భీమ్లా.. అనే పాట‌ను కూడా రాశారు. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హించారు. ఇందులో హీరోయిన్స్‌గా న‌టించిన ఇద్ద‌రూ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌లే కావ‌డం విశేషం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ జోడీగా ఇందులో నిత్యామీన‌న్ న‌టించారు. రానా ద‌గ్గుబాటి జోడీగా సంయుక్తా మీన‌న్ న‌టించారు. ఈ సినిమా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన వీడియో ప్రోమోలు, పాట‌ల‌కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తుంటే.. రానా ఇందులో రిటైర్డ్ మిల‌ట‌రీ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. ఇద్ద‌రు వ్య‌క్తుల ఇగోలు హ‌ర్ట్ అయిన‌ప్పుడు వారెలా రియాక్ట్ అయ్యార‌నే క‌థాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3244UpO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...