Friday, 17 December 2021

తగ్గేదేలే అంటోన్న పుష్ప రాజ్.. థియేటర్లో బన్నీ హంగామా

అల్లు అర్జున్ సినిమా ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది. పుష్ప.. పుష్ప రాజ్‌గా బన్నీ అదరగొట్టేశాడు. తనదైన మ్యానరిజం, యాటిట్యూడ్, ఇగో ఉన్న పాత్రలో బన్నీ ఇరగ్గొట్టేశాడు. బన్నీ దెబ్బకు రికార్డులు ఎలా బద్దలవుతాయో ఇక రేపు చూడాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లో పుష్ప దుమ్ములేపేస్తోంది. ఇక ఉదయం నుంచి సోషల్ మీడియాలో పుష్ప రాజ్ ట్రెండ్ అవుతూనే ఉన్నాడు. సినిమాకు సంబంధించిన ప్రతీ ఒక్క విషయం హైలెట్ అవుతోంది. చివరి క్షణం వరకు ఈ సినిమా మీద ఉత్కంఠ నెలకొంది. కొన్ని చోట్ల సినిమా విడుదలవుతుందా? లేదా? అన్నది కూడా తెలియకుండా పోయింది. చివరకు మళయాలంలో అయితే ఏకంగా తెలుగు వర్షెన్‌నే విడుదల చేశారట. అలా సినిమాకు సంబంధించిన ప్రతీ చిన్న విషయం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక ఏపీలో అయితే కొన్ని చోట్ల బెనిఫిట్ షోలు రద్దయ్యాయట. దీంతో బన్నీ అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచేసుకుంది. థియేటర్ల మీద రాళ్ల దాడి కూడా చేశారు. ఆ ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో షోలు పడ్డాయి. పుష్ప టాక్ అదిరిపోయింది. థియేటర్ల వద్ద బన్నీ ఫ్యాన్స్ దుమ్ములేపుతున్నారు. అయితే తనకెంతో కలిసి వచ్చిన సంధ్య థియేటర్లో ఫ్యాన్స్‌తో కలిసి బన్నీ తన సినిమాను వీక్షించినట్టు కనిపిస్తోంది. తాజాగా సంధ్య థియేటర్లోంచి బన్నీ బయటకు రావడం, అభిమానుల సందోహానికి సంబంధించిన వీడియోను మైత్రీ మూవీస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. బన్నీని చూసిన ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3m8VQ9W
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...