Thursday, 18 November 2021

ఊహించని చిత్ర విచిత్రం.. సరిగ్గా నాలుగేళ్ల క్రితం.. RRR టీమ్ మెసేజ్ వైరల్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి కన్ను పైనే ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత అంతకుమించి అనేలా మెగా, నందమూరి యువ హీరోల కాంబోలో దర్శక ధీరుడు ఈ సినిమాను రూపొందిస్తుండటం ప్రేక్షకుల్లో ఓ రేంజ్ ఆతృత నెలకొల్పింది. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రం కోసం గత కొన్నేళ్లుగా ప్రేక్షకుల ఎదురుచూపులు చూస్తున్నాం. అయితే ఆ ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్ పడే రోజు మరింత దగ్గర పడటంతో ఆసక్తికర ట్వీట్ చేసింది RRR టీమ్. ఈ భారీ సినిమా మొదలుపెట్టి నేటికి సరిగ్గా నాలుగేళ్ళు పూర్తైన సందర్భంగా జక్కన్న బృందం సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ ఫొటో షేర్ చేస్తూ ట్యాగ్ లైన్ రాశారు. అప్పట్లో అంటే నాలుగేళ్ల క్రిందట ఈ సినిమా అనౌన్స్ చేస్తూ , ఇద్దరు హీరోలతో కలిసి రాజామౌళి దిగిన ఓ ఫొటో షేర్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి నేటి వరకు ఆ ఫొటో సోషల్ మీడియాలో ఎక్కడోచోట దర్శనమిస్తూనే ఉంటుంది. అయితే అదే ఫొటోను తాజాగా మరోసారి పంచుకున్న RRR యూనిట్.. ''నాలుగేళ్ల క్రితం రాజమౌళి ఈ పిక్ పెట్టి ఊహించని విధంగా అంచనాలు నెలకొల్పారు. సినిమా మొదలు పెట్టి 3 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 50 రోజుల్లో ఈ సినిమా మ్యాజిక్‌ను రిలీజ్ చెయ్యడానికి సిద్దం చేస్తున్నాం. ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం'' అని పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ 50 రోజులు కూడా ఎప్పుడు గడిచిపోతాయంటూ కామెంట్స్ చేస్తున్నారు మెగా, నందమూరి అభిమానులు. వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా RRR మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 1920 బ్యాక్‌డ్రాప్‌లో ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తుండగా, కొమురం భీం రోల్ ఎన్టీఆర్ పోషిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంగీత దిగ్గజం కీరవాణి బాన్లు కడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3npY2Ll
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...