తనదైన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరైన తాజాగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కిందని తెలిసి షాకవుతున్నారు జనం. తనకు మోసం జరిగిందంటూ పోలీసులను ఆశ్రయించింది స్నేహ. చెన్నైలోని కానత్తూర్ పోలీసు స్టేషన్‌లో ఇద్దరు వ్యాపారవేత్తలపై ఆమె ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది. ఎక్స్‌పోర్ట్ కంపెనీ నివహిస్తున్న ఈ ఇద్దరూ ఆమెను మోసం చేశారట. చాలా రోజుల నుంచి స్నేహ కూడా ఈ కంపెనీలో డబ్బు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చిందట. అయితే స్నేహ చెల్లించిన డబ్బుకు ఇంతవరకు తనకు ఎలాంటి రిటర్న్స్ ఇవ్వలేదట. ఇప్పటి వరకు స్నేహ 26 లక్షల రూపాయలు వారికి ఇవ్వగా దానిపై ఒక్క రూపాయి కూడా తనకి రిటర్న్స్ రూపంలో చెల్లించలేదని స్నేహ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. అందుకు గాను వడ్డీ చెల్లించమని అడిగినందుకు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులకు తెలిపారు స్నేహ. తన ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టి, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్నేహా పోలీసులను కోరినట్లు సమాచారం. ఒకానొక సమయంలో తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్‌గా రాణించిన స్నేహా ఆ తర్వాత తన చిరకాల స్నేహితులు, నటుడు ప్రసన్నను వివాహం చేసుకొని ఆచితూచి సినిమాలు చేస్తోంది. ఆమె చివరగా రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'వినయ విధేయ రామ' చిత్రంలో వదిన పాత్రలో నటించింది. బలమైన పాత్రల వేట కొనసాగుతున్న ఆమె మంచి ఆఫర్స్ వస్తే నటించడానికి సిద్ధంగా ఉందట.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wXEJMx
v
No comments:
Post a Comment