Wednesday, 3 November 2021

RAM CHARAN SHANKAR: పుణెలో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి.. పిక్ వైరల్

మెగా పవర్ స్టార్ డైరెక్టర్ కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమా మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్‌లో 15వ సినిమాగా, దిల్ రాజు బ్యానర్‌లో 50వ చిత్రంగా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్ మీద అందరికీ అంచనాలు పెరిగాయి. పాన్ ఇండియన్ లెవెల్‌లో రాబోతోన్న ఈ చిత్రం ఓపెనింగ్ పోస్టర్ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. సినిమా పూజా కార్యక్రమాల కోసం విడుదల చేసిన పోస్టర్‌కు పెట్టిన ఖర్చే నెట్టింట్లో వైరల్ అయింది. ఆ పోస్టర్‌కు పెట్టిన ఖర్చుతోనే ఏకంగా చిన్న సినిమాను తీయోచ్చని సెటైర్లు పడ్డాయి. కోట్లు ఖర్చు పెట్టి ఆ పోస్టర్‌ను డిజైన్ చేయించాడట శంకర్. అయితే శంకర్ సినిమా అంటే ఖర్చు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ మధ్యే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. నేడు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందని ప్రకటించారు. పుణెలోని సతారా ప్రాంతాల్లో జరిగిన ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. ఫైట్ మాస్టర్లతో శంకర్ రామ్ చరణ్ ఇలా చిత్రయూనిట్ అంతా కూడా పోజులిచ్చింది. అయితే పుణెలో షూటింగ్ అనంతరం నేరుగా రామ్ చరణ్ బెంగళూరకు వెళ్లారు. పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చాడు. పునీత్ చిత్రపటానికి నమస్కరించాడు. శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3k2vyFb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...