Wednesday, 3 November 2021

'సర్కారు వారి పాట' అఫీషియల్ అప్‌డేట్.. మహేష్ అభిమానులు హుషారెత్తేలా ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్

సూపర్ స్టార్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ '' చిత్ర యూనిట్ తాజాగా చిత్ర రిలీజ్ విషయమై అఫీషియల్ అప్‌డేట్ ఇచ్చింది. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటిగా ఉన్న ఈ మూవీని సమ్మర్ రేస్‌లో ఉంచబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పెయిన్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రానికి సంబంధించిన విడుదల విషయంలో అతి పెద్ద అప్డేట్ ఇచ్చారు. వచ్చే ఏడాది ఉగాది సందర్బంగా ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో మహేష్ అభిమానులు హుషారెత్తిపోతున్నారు. సీజన్ పరంగా చూస్తే వచ్చే ఏడాది సమ్మర్‌కు రాబోతోన్నట్టు ప్రకటించిన పెద్ద చిత్రం ఇదే అవుతుంది. ఈ సినిమాకు వేసవి సెలవులు కలిసి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో హాలీడే సమయంలో విడుదలైన మహేష్ బాబు సినిమాలు ''పోకిరి, భరత్ అనే నేను, మహర్షి'' బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు 'సర్కారు వారి పాట' కూడా అదే బాటలో వెళ్లబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట, మహేష్ బాబు సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ బాణీలు కడుతున్నారు. చిత్రంలో మహేష్ సరసన నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ భారీ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై బోలెడన్ని అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BHb4rB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...