'వలయం' ఫేమ్ హీరోగా రూపొందుతోన్న కొత్త సినిమా `గ్యాంగ్‌స్టర్ గంగరాజు'. ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై 'చదలవాడ బ్రదర్స్' సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. డిఫరెంట్ కథాంశానికి కమర్షియల్ హంగులు జోడించి ఈ మూవీ రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇటీవల జరిగిన షెడ్యూల్‌తో '' షూటింగ్ మొత్తం పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా ఫినిష్ చేస్తున్నారు. త్వరత్వరగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు చిత్ర బృందం ధీమాగా ఉంది. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ బాణీలు కడుతున్నారు. చిత్రంలో వేదిక దత్త, వెన్నెల కిషోర్, చరణ్ దీప్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, నిహార్ కపూర్, రాజేశ్వరి నాయర్, సత్యకృష్ణ, రవితేజ, నన్నిమాల, సమ్మెట గాంధీ, రాజేంద్ర, అను మానస, లావణ్య రెడ్డి, అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wbvJ60
v
No comments:
Post a Comment