Monday, 15 November 2021

Radhe Shyam : యూవీ క్రియేషన్స్‌పై బండ బూతులు.. ఊగిపోతోన్న ప్రభాస్ ఫ్యాన్స్

డార్లింగ్ అభిమానుల ఆశలు అడియాశలు అయ్యాయ్. రాధేశ్యామ్ సినిమాలోని పాటల అప్డేట్ ఇవ్వండంటూ అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్‌ను ప్రభాస్ అభిమానులు నానా రకాలుగా ట్రోల్ చేశారు. డార్లింగ్ ప్రభాస్ అభిమానుల ఆశలు ఇన్నాళ్లకు తీరాయ్ అని అనుకునే సమయంలో చివరకు దెబ్బ పడింది. నేటి సాయంత్రం ఐదు గంటలకు అప్డేట్ అంటూ ఊరించారు. కానీ చివరి నిమిషంలో వెన్నుపోటు పొడిచేశారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేడు మళ్లీ యూవీ క్రియేషన్స్ అభిమానుల సహనానికి పరీక్ష పెట్టింది. చెప్పిన టైంకు పాటను విడుదల చేయలేకపోయింది. గత కొన్ని నెలలుగా అప్డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న ఓ అభిమాని అయితే ఏకంగా ఆత్మ హత్య చేసుకునేందుకు కూడా రెడీ అయ్యాడు. దాంట్లో నిజం ఎంతో తెలియదు గానీ.. మొత్తానికి ఆ లేఖ మాత్రం ఫుల్ వైరల్ అయింది. ఐదు గంటలకు పాటను వదులుతామని చెప్పారు. కానీ అలా జరగలేదు. దీంతో అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. యూవీ క్రియేషన్స్, నిర్మాతలు, దర్శకుడిని దారుణంగా బండ బూతులు తిట్టేశారు. నిద్రపోతున్నావా? తాగి పడుకున్నావా? అసలేమైందో చెప్పరా? పాటను ఈ రోజు వదులుతావా? లేదా? అంటూ ఇలా రాయలేని భాషలతో తిట్లు తిడుతున్నారు. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహావేశాలతో ఊగిపోతోన్నారు. ఇంతకీ ఈ రోజు పాట వస్తుందా లేదా? అనేది కూడా అనుమానంగా మారింది. అయితే ఇప్పటికీ పాటను విడుదల చేయకపోవడంపై నెటిజన్లు దారుణంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cflXa0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...