Monday, 15 November 2021

రష్మిక మందన్న హాట్ థై షో.. సెల్ఫీల కోసం మీదపడిన ఫ్యాన్స్

రష్మిక మందన్న.. కన్నడలో కిరిక్ పార్టీతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ర‌ష్మిక మంద‌న్న తెలుగులో ఛ‌లో మూవీతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఆ సినిమా సాధించిన విజ‌యంతో ఈ శాండిల్ వుడ్ బ్యూటీకి తెలుగులో మంచి క్రేజే ద‌క్కింది. క‌న్న‌డ సినిమాల‌తో పాటు తెలుగులో మ‌హేశ్‌తో స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో న‌టించి ఆక‌ట్టుకుంది. ఇప్పుడు ఏకంగా బ‌న్నీ తొలిపాన్ ఇండియా మూవీ పుష్ప‌లో న‌టిస్తోంది. అంతేనా తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తుంది. దీంతో బెంగుళూరు, హైద‌రాబాద్‌, ముంబై అంటూ చ‌క్క‌ర్లు కొడుతుంది. రీసెంట్‌గా ఈ అమ్మడు ముంబై ఎయిర్ పోర్టులో థైస్ చూపిస్తూ పెద్ద ర‌చ్చే చేసింది. అస‌లు క్యూటీ బ్యూటీఫుల్ అమ్మడు అలా చేస్తే అబ్బాయిలు ఊరుకుంటారా.. సెల్ఫీల కోసం ఎగ‌బ‌డ్డారు. అయితే ర‌ష్మిక ఏమాత్రం కోప‌గించుకోలేదు. సెల్ఫీలు ఇస్తూనే న‌వ్వుతూ అక్క‌డున్న వారికి బై చెప్పారు. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ర‌ష్మిక రెండు సినిమాల్లో న‌టిస్తోంది. అందులో ఒక‌టి మిష‌న్ మ‌జ్ను. పాకిస్థాన్ అణ్వాయుధాల‌ను త‌యారు చేస్తుంద‌ని తెలుసుకోవ‌డానికి ఇండియా నిర్వ‌హించిన అతి పెద్ద కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ ఆధారంగానే ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఇందులో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హీరోగా న‌టిస్తుండ‌గా శాంత‌న్ భ‌గ్చీ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా మే 13న విడుద‌ల‌వుతుంది. ఇక మ‌రో చిత్రం గుడ్ బై.. ఇందులో తేనె క‌ళ్ల సుంద‌ని అమితాబ్ బ‌చ్చ‌న్ కుమార్తెగా న‌టిస్తోంది. వ‌చ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. వీట‌న్నింటి కంటే ముందు బ‌న్నీతో క‌లిసి చేసిన పాన్ ఇండియా మూవీ పుష్ప‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుందీ బ్యూటీ. తెలుగులో శ‌ర్వానంద్‌తో క‌లిసి ఆడ‌వాళ్లు మీకు జోహార్లు సినిమాలోనూ న‌టిస్తుంది. ఒక‌వైపు సూపర్ స్టార్ మహేశ్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వంటి వారితో జత కట్టింది. ఇప్పుడు అల్లు అర్జున్‌తోనూ సై అనేసింది. ఒకవైపు స్టార్ హీరోలు, మరో వైపు మీడియం బడ్జెట్ హీరోలను బ్యాలెన్స్ చేస్తూ స్టార్ హీరోయిన్‌గా తనదైన ఇమేజ్‌తో దూసుకెళ్తోంది రష్మిక.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wPzGhi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...