Tuesday, 16 November 2021

Pushpa: ఏ బిడ్డా ఇది నా అడ్డా అంటూ పుష్పరాజ్ మాస్ ఎంట్రీ.. స్టెప్పులతో చించేసిన అల్లు అర్జున్

మోస్ట్ అవైటెడ్ మూవీ '' నుంచి వస్తున్న అప్‌డేట్స్ సినిమాపై ఉన్న ఆతృతను రెక్కలు కడుతున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ సినిమా వచ్చే నెలలో రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర అప్‌డేట్స్‌తో అంచనాలను అంతకంతకూ పెంచేస్తోంది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన పుష్ప ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామి సామి పాటలకు సూపర్ రెస్పాన్స్ రావడంతో తగ్గేదే లే.. అన్నట్లుగా అదే బాటలో చిత్రంలోని నాలుగో పాట ప్రోమో వీడియో వదిలారు. ఇందులో '' అంటూ మాస్ ఎంట్రీ ఇచ్చి పిచ్చెక్కించారు అల్లు అర్జున్. మరోసారి తనదైన స్టెప్పులతో అలరించారు బన్నీ. పుష్పరాజ్ రూపంలో ఆయన లుక్ స్పెషల్ అట్రాక్షన్ అయింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన బాణీలు హుషారెత్తిస్తున్నాయి. నవంబర్ 19 ఉదయం 11: 07 నిమిషాలకు ఈ సాంగ్ ఫుల్ వీడియో విడుదల చేయనున్నట్లు తెలుపుతూ.. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. సుకుమార్- అల్లు అర్జున్ క్రేజీ కాంబోలో ''ఆర్య‌, ఆర్య‌- 2'' సినిమాల తర్వాత హ్యాట్రిక్ మూవీగా 'పుష్ప' డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త సమర్పణలో రూపొందుతున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా అనసూయ కీలకపాత్ర పోషిస్తోంది. బన్నీ ఫ్యాన్స్ ఈ మూవీపై ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cmGR6Q
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...