Tuesday, 16 November 2021

చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్.. ఈ ముగ్గురిలో ఆయనే ఇష్టం! నాన్న ఒక్కటేశాడు.. నిహారిక ఓపెన్ కామెంట్స్

మెగా ఫ్యామిలీలో ఎంతోమంది హీరోలున్నారు. మెగాస్టార్ ఫ్యామిలీ మెంబర్స్ అనే ట్యాగ్‌కి తమ తమ టాలెంట్ యాడ్ చేసి కెమెరా ముందు సత్తా చాటుతున్నారు. అందులో ఎంతో ప్రత్యేమైన వాళ్ళు , . అన్నయ్య చిరంజీవి బాటలోనే నడుస్తూ ఈ ఇద్దరూ అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో తమ మార్క్ చూపెడుతున్నారు. ముగ్గురు మొనగాళ్లుగా మెగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్. మరి అలాంటి ఈ ముగ్గురిలో మెగా డాటర్ నిహారికకు ఎవరంటే ఇష్టం అనేది తాజాగా బయటపడింది. ఆలీ హోస్ట్ చేస్తున్న 'ఆలీతో సరదాగా' ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన నిహారిక.. తమ కుటుంబానికి సంబంధించిన చాలా విషయాలపై ఓపెన్ అయింది. నవంబర్ 22న బుల్లితెరపై ఈ షో ప్రసారం కానున్న నేపథ్యంలో తాజాగా ప్రోమో వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ఆలీతో చెప్పిన సరదా సంగతులు మెగా అభిమానులను ఫిదా చేశాయి. తన కుటుంబ సభ్యులతో ఉన్న బాండింగ్ ఏంటి? చిన్ననాటి జ్ఞాపకాలు తదితర విషయాలపై మెగా డాటర్ ఓపెన్ అయింది. హోస్ట్ ఆలీ వేస్తున్న ప్రశ్నలకు చకచకా సమాధానం చెప్పిన నిహారిక.. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురిలో తనకు ఎవరు ఎక్కువ ఇష్టం అనే దానిపై స్పష్టత ఇచ్చింది. 'నాన్న లేకుంటే చచ్చిపోతా' అంటూ నాగబాబు అంటేనే తనకు చాలా చాలా ఇష్టమని చెప్పింది. ఇక జనరల్ గానే చాలా సీక్రెట్స్ రాబట్టే పయత్నంలో భాగంగా 'మీ నాన్న మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టారా?' అని అడిగారు ఆలీ. దీంతో చిన్నప్పుడు ఓ సమయంలో కొట్టడం జరిగిందని, నా వీపుపై ఒక్కటేశాడని చెప్పింది నిహారిక. ఇకపోతే తనను తన తండ్రి నాగబాబు.. ‘మమ్మీ’ అని పిలుస్తారని, అదే అన్నయ్య వరుణ్‌ తేజ్ అయితే చాలా డిఫరెంట్ అని, మామూలుగా నిహా అని, బాగా ముద్దొస్తే బంగారం అని, ఇంకా బాగా ముద్దొస్తే పంది అని పిలుస్తారని చెబుతూ తెగ నవ్వేసింది నిహారిక. మెగా డాటర్ చెప్పిన ఈ ముద్దు ముద్దు మాటలతో 'ఆలీతో సరదాగా' లేటెస్ట్ ప్రోమో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qIY6Ys
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...