Tuesday, 16 November 2021

ఇన్నేళ్లకు మళ్లీ చిరంజీవితో రమ్యకృష్ణ! అది కూడా అలాంటి రోల్‌లో.. సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ

ఒకానొక సమయంలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన .. అందరు అగ్ర హీరోలతో ఆడిపాడింది. స్టార్ హీరోల సరసన నటించి ఇండస్ట్రీకి ఎన్నో బెస్ట్ హిట్స్ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘అల్లుడా మజాకా, ముగ్గురు మొనగాళ్లు, ఇద్దరు మిత్రులు’ లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన ఆమె, ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా అదే హవా నడిపిస్తూ బలమైన పాత్రలను ఎంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా రమ్యకృష్ణకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ సినిమా 'లూసిఫర్'కు తెలుగు రీమేక్‌గా 'గాడ్ ఫాదర్' మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోకి వరుసకు సోదరి అయ్యే ఓ మహిళ పాత్ర చాలా కీలకం కానుందట. దీంతో ఈ బలమైన రోల్ కోసం శోభన, విద్యాబాలన్ లాంటి వాళ్ళ పేర్లను పరిశీలించిన టీమ్ చివరకు రమ్యకృష్ణను ఫైనల్ చేశారని సమాచారం. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని, చిరు చెల్లెలిగా వెండితెరపై మెప్పించడానికి రమ్యకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్. త్వరలోనే దీనిపై మేకర్స్ నుంచి ప్రకటన రావొచ్చని తెలుస్తోంది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్‌లో స్వల్ప మార్పులు ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో మరో ముఖ్యపాత్రలో సత్యదేవ్‌ కనిపించనుండగా.. అతిథి పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ నటించనున్నారనే టాక్ బయటకు రావడం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఫిమేల్ లీడ్‌గా నయనతారను తీసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక సినిమాకు ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తమన్ బాణీలు కడుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీపై మెగా ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/322XJOd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...