Tuesday, 16 November 2021

మానసిక పరిపక్వత, మెంటల్ స్టేటస్‌పై సామ్ పోస్ట్.. బలం, బలహీనత అంటూ సమంత మరో యాంగిల్

నాగ చైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం సోషల్ మీడియాలో యమ యాక్టివ్ అయింది . మునుపటిలాగానే ఎప్పటికప్పుడు ఫ్రెష్ పోస్టులు పెడుతూ అందరితో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటోంది. అలాగే విడాకుల తాలూకు విషయాలు, చేదు జ్ఞాపకాలు మరిచిపోయేందుకు ప్రయత్నిస్తూనే పలు మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తోంది. 'అమ్మ చెప్పింది' అనే హ్యాష్ ట్యాగ్ వాడుతూ తన లోని బలాన్ని, ఆత్మ స్థైర్యాన్ని బయటపెడుతున్న సామ్.. తాజాగా ఓ వ్యక్తి మెంటల్ స్టేటస్‌పై తనదైన కోణంలో కామెంట్ చేసి వార్తల్లో నిలిచింది. ''అందరి ముందు బల ప్రదర్శన చేసే వాళ్లు మానసికంగా ఎప్పటికీ దృడంగా ఉండలేరు. ఊహించని సంఘటనల్లో సమయ స్ఫూర్తిగా వ్యవహరించి, దాన్ని అధిగమించే వారే నిజమైన బలవంతులు'' అని సమంత తన ఇన్స్‌స్టా స్టోరీలో పేర్కొంది. వ్యక్తి మానసిక పరిపక్వత గురించి సామ్ ఇలా మాట్లాడటం ఆమె అభిమానులకు, నెటిజన్లకు కనెక్ట్ అయింది. అవును, శారీరక బలం కంటే.. మానసిక బలం చాలా గొప్పదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. జీవితంలో ఊహించని విధంగా వచ్చే సమస్యలను ఎదుర్కొని సమయస్ఫూర్తి ప్రదర్శిస్తూ పరిష్కారం దిశగా పోరాడే వాళ్లే నిజమైన బలవంతులనేది సమంత ఉద్దేశమని చెప్పుకోవచ్చు. అయితే బలప్రదర్శన చేసే వాళ్ళు ఎప్పటికీ మానసికంగా దృడంగా ఉండలేరని సమంత చెప్పడం వెనక ఏదో అర్థం ఉందని వెతుకుతున్నారు నెటిజన్లు. ఏదేమైనా తానూ మాత్రం దృఢమైన సంకల్పంలో ఉన్నానని, మానసికంగా కృంగిపోవడం లేదని మాత్రం తన పోస్టుల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తోంది సమంత. ఇటీవలే 'శాకుంతలం' సినిమా కంప్లీట్ చేసిన సమంత.. తన తదుపరి సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. మరో రెండు తెలుగు, తమిళ ద్విభాషా చిత్రాలను ఓకే చేసిన ఆమె, అల్లు అర్జున్ 'పుష్ప' మూవీలో ఐటెం సాంగ్‌లో మెరవనుంది. అలాగే సమంత నటించిన తమిళ సినిమా 'కాతువాకుల రెండు కాదల్' డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DqEH22
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...