Monday, 8 November 2021

Pakka Commercial Teaser : ఎప్పుడో చేసి చూసొచ్చా.. దుమ్ములేపిన గోపీచంద్

గోపీచంద్‌కు సరైన హిట్ పడటం లేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా గోపీచంద్ సక్సెస్ అవ్వడం లేదు. సీటీమార్ అంటూ వచ్చాడు. కానీ పక్కా రొటీన్ రాడ్ చిత్రమంటూ నెటిజన్లు ఏకిపారేశారు. కమర్షియల్‌గానూ సినిమాకు నష్టాలే వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే గోపీచంద్‌కు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంచి మాస్ ఎంటర్టైనర్ పడాలి. సరైన హిట్ కొట్టాలి. అయితే అంటూ రాబోతోన్న గోపీచంద్ ఈ సారి హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు. తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం నుంచి తాజాగా అప్డేట్ వచ్చింది. పక్కా కమర్షియల్ సినిమా నుంచి తాజాగా టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ ట్రైలర్‌లో గోపీచంద్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. ఇక యాక్షన్ సీక్వెన్స్‌ల్లో గోపీచంద్ స్టైల్ కనిపించింది. ‘ఎవరికి చూపిస్తున్నారు సర్ మీ విలనిజం.. మీరిప్పుడు చేస్తున్నారు.. నేను ఎప్పుడో చేసి చూసొచ్చా.. అలాగే నా హీరోయిజంకు ఓ ఆరా ఉంటుంది. కాన్సన్‌ట్రేట్ చేస్తే ఆరా నుంచి ఒక ఆర్ఆర్ వినిపిస్తుంది. ఇమాజిన్ చేసి చూసుకోండి.. కిక్ ఆస్ ఉంటుంది’ అని గోపీచంద్ డైలాగ్స్ చెప్పిన తీరు అందరినీ మెప్పించేలా ఉంది. గోపీచంద్ సరసన ఈ చిత్రంలో నటిస్తోంది. ప్రతీ రోజూ పండుగే సినిమాలో ఏంజర్ ఆర్న లాంటి పాత్రనే ఇందులోనూ పోషించినట్టు టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. తనలోని కామెడీ యాంగిల్‌ను మారుతి బాగానే వాడుతున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mR2YbQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...