Sunday, 14 November 2021

Most Eligible Bachelor : ఓటీటీలోకి రాబోతోన్న ‘బ్యాచ్‌లర్’

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే కాంబినేషన్‌లో వచ్చిన సినిమాతో మొదటిసారిగా సక్సెస్ రుచి చూశాడు. అయితే అది మరీ గొప్ప విజయం సాధంచిన చిత్రమేమి కాదు. కానీ అఖిల్ సినిమాల్లో కాస్త బెటర్ అని చెప్పుకునేంతలా ఉంది. ఆ లెక్కన అది హిట్ అన్నమాటే. ఇక కలెక్షన్లు కూడా ఓ మోస్తరుగా వచ్చాయని అంటున్నారు. దాంట్లో ఎంత నిజముంటుందో అందరికీ తెలిసిందే. మొత్తానికి అఖిల్ మాత్రం ఈ సినిమాతో నిరాశపరచలేదు. హిట్ కొట్టేశాడు. పూజా హెగ్డే విజయాల పరంపరం అలా కొనసాగుతూనే పోతోంది. అయితే అఖిల్ సినిమా ఆహాలో వస్తుందని అందరికీ తెలిసిందే. నిర్మించింది కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ మీదే కాబట్టి.. ఆహాలో రావడంలో ఎలాంటి ఆశ్చర్యం అవసరం లేదు. అయితే ఇప్పుడు ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఆహాలో ఎప్పటి నుంచి అందుబాటులోకి రాబోతోందనేది తెలిపారు. ఈ క్రమంలో ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇద్దరూ ఫ్లైట్‌లో కూర్చుని ఏదో ముచ్చట్లు పెడుతున్నారు. మొత్తానికి నవంబర్ 19 నుంచి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమా ఆహాలో అందరికీ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే లవ్ స్టోరీ సినిమా ఆహాలో రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రాన్ని ఓటీటీ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి. చాలా రోజుల తరువాత బొమ్మరిల్లు భాస్కర్‌కు మళ్లీ సక్సెస్ వచ్చినట్టు అయింది. ఇకపై ఆయన స్పీడు పెంచుతాడో లేదో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3HwPzy7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...