Sunday, 14 November 2021

ఒక్క ట్వీట్‌తో గందరగోళం.. వామ్మో నాగ చైతన్య మామూలోడు కాదు

సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించడు. ఎప్పుడో అమాసకు పున్నానికి అన్నట్టుగా వాడుతుంటాడు. తన సినిమా ప్రమోషన్స్, పండుగలకు విష్ చేయడం అలా అన్నమాట. అలాంటి నాగ చైతన్య ఇప్పుడు కాస్త అందరి ప్రపంచంలోకి వస్తున్నాడు. సినిమా ఈవెంట్లకు ఎవరైనా పిలిస్తే వెళ్తున్నాడు. ప్రమోషన్స్ చేస్తున్నాడు. సమంతతో విడిపోయిన తరువాత ఇంకా యాక్టివ్ అయినట్టు కనిపిస్తోంది. విడిపోయామనే బాధ ఇద్దరిలోనూ కనిపించడం లేదు. అయితే సమంత మాత్రం ఇది వరకంటే ఎక్కువ సంతోషంగా ఉంటోంది.. ఎక్కువగా యాక్టివ్‌ అవుతోంది. కానీ నాగ చైతన్య సోషల్ మీడియా ప్రపంచానికి కాస్త దూరంగానే ఉంటున్నాడు. అలాంటి నాగ చైతన్య ఓ ట్వీట్ వేశాడు. అది ఎవరి గురించి? అసలు ఆ ట్వీట్ ఏంటి? దాని అర్థం ఏంటి? అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు. ఒక్క క్షణం పాటు కొందరు నెటిజన్లు జుట్టు పీక్కున్నారు. కానీ తరువాత కొంత మంది నెటిజన్లు అసలు విషయం చెప్పేశారు. నాగ చైతన్య ఓ రేసర్ గ్రేజీ వాలే గురించి ట్వీట్ చేశాడు. అది ఫేమస్ రేసర్ పేరు అని.. అతను ఈ రోజు చివరి రైడ్ చేసి వీడ్కోలు తీసుకున్నాడట. అందుకే ఆయన గురించి మన నాగ చైతన్య ట్వీట్ వేశాడు. నాగ చైతన్య కూడా ఓ రేసర్ అన్న సంగతి తెలిసిందే. నాగ చైతన్యకు కార్లు, బైకులు నడపడం అంటే చాలా ఇష్టం. ప్రొఫెషనల్ రేసర్ అయిన నాగ చైతన్యను ఇప్పుడు నెటిజన్లు ఓ కోరిక కోరుతున్నారు. రేసింగ్ అంతే ఇష్టం కదా? దాని మీదే ఓ సినిమాను తీసేయండి అని కోరుతున్నారు. మరి ఫ్యాన్స్ కోరికను చై వింటాడో లేదో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DeQK2A
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...