Sunday, 14 November 2021

‘పుష్ప’లో సమంత ఐటెమ్ సాంగ్‌.. షూటింగ్ ఎప్పటి నుంచంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప ది రైజ్‌’. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్తం శెట్టి మీడియా బ్యాన‌ర్స్‌పై సినిమా రూపొందుతోంది. ఒక పాట మిన‌హా ఎంటైర్ షూటింగ్ పూర్త‌య్యింది. అది కూడా ఐటెమ్ సాంగ్‌. అస‌లు సినిమాలో ఐటెమ్ సాంగ్‌లో ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై ప‌లు ర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి. మేక‌ర్స్ బాలీవుడ్ ఐటెమ్ గ‌ర్ల్స్ నోరా ఫ‌తేహి, స‌న్నీలియోని, దిశా ప‌టాని వంటి వారిని కూడా సంప్ర‌దించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు, ఈ చిత్రంలో స‌మంత ఐటెమ్ సాంగ్‌లో న‌టించ‌నుంద‌ని టాక్‌. ఇప్ప‌టికే స‌మంత ఐటెమ్ సాంగ్‌లో న‌టించ‌డానికి ఓకే చెప్పిసింద‌ట‌. న‌వంబ‌ర్ 26 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయ‌బోతున్నార‌ట‌. అంటే న‌వంబ‌ర్ చివ‌రి కంతా ఈ సాంగ్‌ను పూర్తి చేసేలా సుకుమార్ ప్లాన్ చేసేశారు. మ‌రో వైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. డిసెంబ‌ర్ 17న పుష్ప ది రైజ్‌ను ఐదు భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. స‌మంత ఓ ఐటెమ్ సాంగ్‌లో న‌టించ‌నుండ‌టం ఇదే తొలిసారి. స్పెష‌ల్ సాంగ్స్‌ను చిత్రీక‌రించ‌డంలో సుకుమార్ స్పెష‌లిస్ట్‌. ఆయ‌న స‌మంత‌తో ఇలాంటి సాంగ్‌ను ఎలా చేస్తాడ‌నేది అంద‌రిలో ఆస‌క్తిని పెంచుతోంది. ఇంత‌కు ముందు రామ్‌చ‌ర‌ణ్‌తో సుకుమార్ తెర‌కెక్కించిన రంగ‌స్థ‌లంలో స‌మంత హీరోయిన్‌గా న‌టించింది. స‌మంత కెరీర్ ప‌రంగా ఓ కొత్త టర్న్ తీసుకుంద‌ని అయితే చెప్పొచ్చు. ఇందులో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఫ‌హాద్ ఫాజిల్, సునీల్ విల‌న్స్‌గా న‌టిస్తున్నారు. న‌వంబ‌ర్ 19న ఈ సినిమా నుంచి ఏ బిడ్డ ఇది నా అడ్డా అనే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను నాలుగో పాట‌గా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. ఈ సాంగ్‌ను అల్లు అర్జున్‌తో వెయ్యి మంది డాన్స‌ర్స్‌తో హైద‌రాబాద్‌లోనే రీసెంట్‌గా చిత్రీక‌రించారు. శేషాచ‌ల అడవుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో పుష్ప సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో అల్లు అర్జున్ క‌నిపించ‌బోతున్నారు. సినిమా రెండు భాగాలుగా తెర‌కెక్కుతోంది. తొలి భాగం డిసెంబ‌ర్ 17న వ‌స్తుంటే, రెండో భాగం వ‌చ్చే ఏడాదిలో ఉండొచ్చున‌ని సినీ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ సినిమా కోసం ఇది వ‌ర‌కెన్న‌డూ లేని విధంగా రగ్డ్ లుక్‌లో అల్లు అర్జున్ క‌నిపించ‌బోతున్నారు. బ‌న్నీ, సుకుమార్ తొలి పాన్ ఇండియా ఇదే. ఆర్య‌, ఆర్య 2 చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో రాబోతున్న చిత్రం కూడా ఇదే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3c96TKT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...