Sunday, 14 November 2021

Akhanda Trailer : మీరు దండం పెడతారు.. నేను పిండం పెడతాను.. గర్జించిన బాలయ్య

నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే వదిలిన అప్డేట్లతో అఖండ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. దీంతో ఒక్కసారి బాలయ్య గర్జనకు సోషల్ మీడియా ఉలిక్కి పడింది. ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్‌ను నవంబర్ 14న విడుదల చేశారు. ఆదివారం సాయంత్రం 7:09 గంటలకు రిలీజ్ చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలయ్య డైలాగ్‌లకు అందరూ విజిల్స్ వేయాల్సిందే. ‘విధికి విధాతకు విశ్వానికి సవాళ్లు విసరకూడదు’.. అంటూ ట్రైలర్ మొదలవుతుంది.. ‘అంచనా వేయడానికి పోలవరం డ్యామా? పట్టిసీమ తూమా? పిల్ల కాలువ’, ‘ఒక మాట నువ్వంటే శబ్దం.. అదే నేను అంటే శాసనం.. దైవ శాసనం’, ‘మీకు సమస్య వస్తే దండం పెడతారు.. నేను పిండం పెడతాను’, ‘అఖండ.. నేనే నేనే’ అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ అద్బుతంగా ఉన్నాయి. ‘నాకు బురద అంటింది.. నాకు దురద వచ్చింది.. నాకు బ్లడ్ వచ్చింది.. గడ్డ వచ్చింది అని అడ్డమైన సాకులు చెబితే’ అంటూ శ్రీకాంత్ కూడా తన విలనిజాన్ని చూపించారు. జగపతి బాబు కూడా కొత్త గెటప్పులో కనిపించాడు. శ్రీకాంత్ నిజంగానే భయపెట్టేశాడు. ట్రైలర్స్‌లో డైలాగ్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. రెండు గెటప్స్‌లో బాలకృష్ణ కనిపించి మెప్పించారు. తమన్ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. మిర్యాల రవిందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగపతిబాబు, శ్రీకాంత్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. తమన్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. సీ రాం ప్రసాద్ కెమెరామెన్‌గా, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wJ7kVE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...