కెరీర్ ఆరంభం నుంచే డిఫరెంట్ కథలతో అన్నివర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్న మెగా ప్రిన్స్ .. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో '' సినిమా చేస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. నదియా, నరేష్, నవీన్ చంద్ర, జగపతి బాబు, , కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేసిన చిత్రయూనిట్.. ప్రమోషన్స్ వేగం పెంచింది. ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే 'గని ప్రపంచం ఇదే' అంటూ ఇటీవలే ఓ చిన్న వీడియోతో ఆసక్తి రేకెత్తించారు. తాజాగా ఉపేంద్ర, సునీల్ శెట్టి పాత్రల పేర్లు పరిచయం చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. విక్రమాదిత్యగా ఉపేంద్ర నటిస్తుండగా.. విజేంద్ర సిన్హగా సునీల్ శెట్టి కనిపించనున్నారని పేర్కొన్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు వెంకటేష్ (బాబీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం వరుణ్ తేజ్ ప్రత్యేకంగా బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. వరుణ్ తేజ్ కెరీర్‌లో డిఫరెంట్ సినిమాగా రాబోతున్న ఈ మూవీపై మెగా అభిమానుల్లో బోలెడన్ని అంచనాలున్నాయి. డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3HjMjWw
v
No comments:
Post a Comment