Sunday, 14 November 2021

Ram Charan: యంగ్ హీరోయిన్‌తో రామ్ చరణ్ ప్రేమ పాఠాలు! బయటకొచ్చిన క్రేజీ న్యూస్

మెగా పవర్ స్టార్ వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR మూవీతో బిజీగా ఉన్న ఆయన, తన తదుపరి సినిమాను బడా దర్శకుడు దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్‌గా షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా రామ్ చరణ్ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ను కూడా దిగ్విజయంగా పూర్తి చేసిన డైరెక్టర్ శంకర్.. తదుపరి షెడ్యూల్ కోసం కియారాను సెట్స్ మీదకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం కియారాకు హీరో రామ్ చరణ్ ప్రేమ పాఠాలు చెప్పబోతున్నాడని ఓ న్యూస్ బయటకొచ్చింది. తాజా షెడ్యూల్‌లో ఇందుకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారట. నవంబర్ 15 అంటే సోమవారం నుంచి ఈ షెడ్యూల్ షురూ చేయబోతున్నారని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఈ షెడ్యూల్‌లో రామ్ చరణ్, కియారాపై లవ్ సీన్స్ షూట్ చేయబోతున్నారట. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా కోసం 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ కేటాయించారని సమాచారం. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ నుంచి రాబోతున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదట. ఇక ఈ చిత్రం కోసం జయరాం, శ్రీకాంత్, సునీల్, అంజలి తదితరులను ఎంపిక చేశారు శంకర్. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్ వ్యవహరిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3HlrSIF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...