Sunday, 14 November 2021

బ‌రువు త‌గ్గడం కోసం అనుష్క శెట్టి ఫాలో అవుతున్న 6 చిట్కాలు

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో శెట్టికి ఉండే క్రేజే వేరు. ఆమెను అంద‌రూ క‌లెక్ష‌న్స్ అని.. బాక్సాఫీస్ భాగ‌మ‌తి అని పిలుచుకుంటుంటార‌నే సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్‌కి చెందిన‌ నేటి త‌రం హీరోయిన్స్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు ఓ ఊపు తెచ్చింది అనుష్క శెట్టి అన‌డంలో సందేహం అక్క‌ర్లేదు. అరుంధ‌తి, భాగ‌మ‌తి చిత్రాలే అందుకు ఉదాహ‌ర‌ణ‌లు. వీటితో పాటు బాహుబ‌లి చిత్రంలో త‌న న‌ట‌న‌తో ఆమె పాత్ర‌కు ప్రాణ ప్ర‌తిష్ట చేశారు. అయితే ఇలాంటి వైవిధ్యం కోసం ఆమె పాకులాడ‌టం కూడా ఆమెకు ఇబ్బందుల‌ను క‌లిగించింది. అది కూడా సైజ్ జీరో సినిమా రూపంలో. ఆ సినిమా కోసం అనుష్క శెట్టి బ‌రువు పెరిగింది. కొంద‌రు స‌న్నిహితులు చెప్పినా అప్పుడు పాత్ర కోసం క‌ష్ట‌ప‌డాల‌నే ఉద్దేశంతో ఆమె బ‌రువు పెరిగింది. కానీ ఆ బ‌రువును త‌గ్గించుకోవ‌డంలో ఆమె ఫెయిల్ అయ్యింది. అయితే ఏదో మేనేజ్ చేసుకుంటూ వ‌చ్చి బాహుబ‌లి, భాగ‌మ‌తి సినిమాల‌ను పూర్తి.. నిశ్శ‌బ్దం సినిమా స‌మ‌యంలోనూ ఆమె బ‌రువు త‌గ్గ‌లేదు. అయితే త‌ను చేస్తున్న త‌ప్పును గ్ర‌హించిందేమో కానీ.. స్వీటీ. సినిమాల‌కు చాలా కాలంగా దూరంగా ఉంటోంది. అంతే కాదండోయ్ ఇప్పుడు బ‌రువు త‌గ్గే ప‌నిలో సీరియ‌స్‌గా ఉంద‌ని టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే ఆమె చేయ‌బోయే కొత్త సినిమాలో స్లిమ్‌గా క‌న‌ప‌డుతుంద‌ని ఆమె స‌న్నిహితులు అంటున్నారు. పెరిగిన బ‌రువును త‌గ్గ‌డానికి అనుష్క 6 చిట్కాల‌ను పాటిస్తుంది. ఆవేంటో మీరు కూడా తెలుసుకోండి మ‌రి.. చిట్కా 1: ఎక్కువ‌గా నీళ్లు తీసుకుంటుంది. అలాగే టెంకాయ‌నీళ్ల‌ను కూడా మ‌ధ్య మ‌ధ్య‌లో తీసుకుంటుంద‌ట‌. దీని వ‌ల్ల ఆమె బ‌రువు త‌గ్గ‌డమే కాకుండా చ‌ర్మం కూడా ప్ర‌కాశ‌వంత‌మవుతుందని డైటీషియ‌న్ సూచించార‌ట‌. చిట్కా 2: త‌న ఆహారంలో ఎక్కువ‌గా కూర‌గాయ‌ల‌ను తీసుకుంటుంద‌ట‌. ముఖ్యంగా ఫైబ‌ర్ ఉండే కూర‌గాయ‌ల‌కు స్వీటీ ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తుంద‌ట‌. చిట్కా 3: తిండిని మూడు పూట‌లుగా కాకుండా ఆ క్వాంటినీ నాలుగైదు వేళ‌ల్లో నిర్ణీత స‌మ‌యంలో తీసుకుంటుంద‌ట‌. దీని వ‌ల్ల ఎక్కువ ఆక‌లి వేయ‌కుండా తిండిపై ఎక్కువ దృష్టిపోకుండా ఉంటుంద‌ట‌. చిట్కా 4: రాత్రి 8 గంట‌ల‌లోపలే డిన్న‌ర్‌ను పూర్తి చేస్తుంద‌ట అనుష్క శెట్టి. చిట్కా 5: ఇంటి ఆహారాన్నే తీసుకోవ‌డంతో పాటు అయిల్ ఎక్కువ‌గా లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది అనుష్క‌. అలాగే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ‌గా లేకుండా చూసుకుంటుంద‌ట జేజెమ్మ‌ చిట్కా 6: ఆహారంతో పాటు రెగ్యుల‌ర్‌గా యోగా, ఎక్స‌ర్‌సైజుల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తుంద‌ట అనుష్క‌. త్వ‌ర‌లోనే అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నుంది. ఆ సినిమాలో స్లిమ్‌గా ఉండే అనుష్క‌ను చూడొచ్చున‌ని ఆమె అభిమానుల‌ను ఎదురుచూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wMXh1L
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...