Sunday, 14 November 2021

మ‌రోసారి అమ్మ అవుతున్న ఐశ్వ‌ర్యా రాయ్‌..ఈ వీడియోనే సాక్ష్యం!

మాజీ ప్ర‌పంచ సుంద‌రి, అభిషేక్ బ‌చ్చ‌న్ స‌తీమ‌ణి ఐశ్వ‌ర్యా రాయ్ మ‌రోసారి త‌ల్లి కాబోతున్నారా? అంటే అవున‌నే అంటున్నాయి బాలీవుడ్ వ‌ర్గాలు. అందుకు ఇదే సాక్ష్య‌మంటూ ఓ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. అభిషేక్ బ‌చ్చ‌న్‌, ఐశ్వ‌ర్యా రాయ్ బ‌చ్చ‌న్‌, ఆరాధ్య ఎయిర్‌పోర్టులోకి వెళ్లేట‌ప్పుడు ఫొటోలు తీయ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఆ స‌మ‌యంలో ఆమెకు ముందు అడ్డంగా అభిషేక్ రాగా.. ఐశ్వ‌ర్య ఓ పెద్ద బ్యాగును అడ్డం పెట్టుకున్నారు. మ‌రో వైపు ఆరాధ్య నిలుచుకుంది. ఐశ్వ‌ర్య రాయ్ త‌న పొట్ట భాగాన్ని క‌వ‌ర్ చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఈ వీడియో చూసిన నెటిజ‌న్స్ మ‌రో వార‌సుడో, వార‌సురాలో బ‌చ్చ‌న్ ఇంట అడుగు పెట్ట‌బోతున్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఐశ్వ‌ర్య రాయ్ పెద్దగా సినిమాల‌ను ఒప్పుకోవ‌డం లేదు. రీసెంట్‌గానే మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పీరియాడిక‌ల్ మూవీ పొన్నియ‌న్ సెల్వ‌న్‌లో డ్యూయెల్ రోల్‌లో న‌టించింది. ఆమెకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ఇప్పుడు ఇంటికే ప‌రిమిత‌మైంది. ప్రెగ్నెంట్ కార‌ణంగానే ఆమెకు కెమెరాల‌కు దూరంగా ఉన్నార‌ని మీడియా వ‌ర్గాలు అంటున్నాయి. ఈ విష‌యాన్ని ఇటు ఐశ్వ‌ర్యా రాయ్ కుటుంబీకులు, అటు బ‌చ్చ‌న్ కుటుంబీకులు ఎవ‌రూ క‌న్‌ఫ‌ర్మ్ చేయ‌లేదు. కానీ వీడియో మాత్రం తెగ వైర‌ల్ అవుతుంది. అభిషేక్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆరాధ్య ఇప్పుడు మాల్దీవుల్లో వెకేషన్‌కు వెళ్లారు. మణిరత్నం డైరెక్ట్ చేసిన గురు సినిమా స‌మ‌యంలో అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న‌యుడు అభిషేక్ బ‌చ్చ‌న్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఐశ్వ‌ర్యా రాయ్. అప్పుడు ఆమె కెరీర్ పీక్స్‌లోనే ఉంది. ఆ త‌ర్వాత ఆమె అడ‌పా ద‌డ‌పా సినిమాల‌ను చేస్తూనే ఉన్నా ఎక్కువ స‌మ‌యాన్ని ఫ్యామిలీకే కేటాయించింది. 2018లో విడుదలైన ఫన్నీ ఖాన్ సినిమాలో ఐశ్వర్య రాయ్ నటించారు. ఆ తర్వాత ఆమె సినిమాల్లో కానీ, డిజిటల్ మాధ్యమంలో కానీ, బుల్లితెరపై షోస్‌లో ఎక్కడా కనపడలేదు. ఇంటికి మాత్రమే పరిమితమైయ్యారు. మ‌రిప్పుడు మీడియాలో ఐశ్వ‌ర్య ప్రెగ్నెన్సీ వ‌స్తున్న వార్త‌లపై కుటుంబ స‌భ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.


      from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cgT6BS
      v

      No comments:

      Post a Comment

      చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

      చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...