లేడీ సూపర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం మార్మోగిపోతోంది. నయన్ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్లు వచ్చేస్తున్నాయి. పస్ట్ లుక్, కొత్త పోస్టర్లతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ గా మారింది. ఇక ప్రియుడు విఘ్నేశ్ శివన్ ఏర్పాటు చేసిన బర్త్ డే పార్టీకి సంబంధించిన పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సినిమా యూనిట్ అంతా కలిసి నయన్ బర్త్ డేను సెలెబ్రేట్ చేసినట్టు కనిపిస్తోంది. కాథు వాక్కుల రెండు కాదల్ సెట్‌లో నయన్ బర్త్ డేను సెలెబ్రేట్ చేసినట్టు కనిపిస్తోంది. తాజాగా నయన్‌కు స్పెషల్‌గా విషెస్ చేసింది. ఆమె వచ్చింది.. ఆమె ఎన్నో చూసింది.. ఆమె ధైర్యం చేసింది.. ఆమె కలలు కంది.. ఆమె నటించింది.. ఆమె సాధించింది.. హ్యాపీ బర్త్ డే నయన్.. క్వీన్, కాథువాకుల రెండు కాదల్ అంటూ ఇలా హ్యాష్ ట్యాగ్‌లతో సమంత హల్చల్ చేసింది. అయితే సమంత గతంలో తనను ఓ సారి లేడీ సూపర్ స్టార్ అని ఎవరో అంటే.. నయనతార ట్యాగ్ లాగేసి నాకు పెడుతున్నారా? అని కౌంటర్ వేసింది. అలా మొత్తానికి సౌత్ సూపర్ స్టార్‌లను ఒకే ఫ్రేమ్‌లో ఇలా చూడటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం కాథువాకుల రెండు కాదల్ సినిమాతో నయన్, సమంత, విజయ్ సేతుపతి మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కనెక్ట్ అనే కొత్త సినిమా, గాడ్ ఫాదర్‌లో నయన తార నటించబోతోందంటూ అప్డేట్లు వచ్చేశాయి. ప్రస్తుతం నయన్ మాత్రం నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Fr4asP
v
No comments:
Post a Comment