Thursday, 18 November 2021

లేడీస్ ఫస్ట్ అంటూ కృతి శెట్టి లుక్ రివీల్ చేసిన నాగ చైతన్య.. అలా బేబమ్మ అదరగొట్టిందిలే!

అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా ‘’. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తుండగా ఆయన సరసన ఆడిపాడుతోంది. గతంలో వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయన' సినిమాకు సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ కృతి శెట్టి లుక్ రివీల్ చేశారు. ‘నాగ లక్ష్మి’గా ఆమె క్రేజీ రోల్ చేయబోతోందని తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. ''బంగార్రాజు రాబోతున్నాడు.. లేడీస్ ఫస్ట్.. మా నాగలక్ష్మిని చూసేయండి'' ఈ పోస్టర్‌ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు నాగ చైతన్య. ఎన్నికల్లో గెలిచనట్టుగా చేతిని ఊపుతూ ఈ పోస్టర్‌లో అదిరిపోయే లుక్ ఇచ్చింది కృతి శెట్టి. పక్కా పల్లెటూరి అమ్మాయిలా ఎంతో అందంగా కనిపిస్తోంది. దీంతో ఈ పోస్టర్ వైరల్‌గా మారింది. 'బంగార్రాజు' సినిమాను ప్రకటించిన క్షణం నుంచి బజ్ ఏర్పడింది. 'సోగ్గాడే చిన్న నాయన' సినిమాలో బంగార్రాజు పాత్రకు ఎంత మంచి పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ అద్బుతమైన కథతో రాబోతోన్నారు. ప్రీక్వెల్‌లో ఉన్నట్టుగానే నాగార్జున సరసన రమ్యక‌ష్ణ నటించనున్నారు. నాగార్జున, రమ్యకృష్ణలతో పాటుగా మరి కొన్ని ఇంట్రెస్టింగ్ పాత్రలను కళ్యాణ్ కృష్ణ ఇందులో చూపించబోతోన్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మైసూర్‌లో జరుగుతోంది. నటీనటులందరి మీద కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. రొమాన్స్, ఎమోషన్స్, అన్నిరకాల కమర్షియల్ అంశాలతో బంగార్రాజు చిత్రం రాబోతోంది. నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తోన్న రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kQ1AVp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...