Tuesday, 23 November 2021

EMK: నీకంటే ఆయనే బెటర్.. ఎన్టీఆర్‌‌పై మహేష్ బాబు క్రేజీ కామెంట్స్.. వీడియో వైరల్

రీసెంట్ గానే 'ఎన్టీఆర్‌తో ' అనే ప్రకటన వచ్చి ఇరువురు హీరోల అభిమానులను హుషారెత్తించిన సంగతి తెలిసిందే. బుల్లితెరపై భారీ టీఆర్ఫీ అందుకుంటున్న రియాలిటీ షోలలో ఒకటిగా ‘’ దూసుకుపోతోంది. హోస్ట్‌గా యంగ్‌ టైగర్‌ తనదైన స్టైల్‌తో చిన్నితెరపై ఎంటర్‌టైన్ చేస్తున్నారు. కాగా మరికొద్ది రోజుల్లో స్టార్‌ హీరోల సరదా మాటలకు 'ఎవరు మీలో కోటీశ్వరులు' వేదిక కాబోతోంది. ఎన్టీఆర్‌కు తోడుగా మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వడానికి సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు రంగంలోకి దిగారు. తాజాగా వీరిద్దరూ కలసి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ స్టేజిపై సందడి చేయగా ఈ ప్రత్యేక ఎపిసోడ్‌ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో హాట్ సీట్లో ఒకరు, హోస్ట్ సీట్లో ఒకరు ఇలా ఇద్దరు హీరోలను చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. 'వెల్‌కమ్‌ మహేష్ అన్న' అంటూ మహేష్ బాబుకు ఎన్టీఆర్ స్వాగతం పలకడం, 'సెటప్ అదిరిపోయింది' అని మహేష్ చెప్పడం, ఆ తర్వాత 'నా రాజా..' అంటూ ఎన్టీఆర్‌ తనదైన మ్యానరిజంతో జోష్‌ నింపడం ఈ ప్రోమో వీడియోలో హైలైట్ అయ్యాయి. తాను చెప్పిన సమాధానాన్ని ఎన్టీఆర్ అటు తిప్పి ఇటు తిప్పి తికమక పెట్టేందుకు ప్రయత్నించడంతో, "నీ కంటే మీ గురువు (కంప్యూటర్) గారే నయం" అంటూ ఎన్టీఆర్‌పై మహేష్ బాబు క్రేజీ కామెంట్ చేయడం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అంతకుముందు ఈ షోకు రామ్‌ చరణ్‌, సమంత వచ్చి హాట్ సీట్లో కూర్చొని సందడి చేసిన సంగతి తెలిసిందే. మరి సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ మేర అట్రాక్ట్ చేస్తాడు? ఎంత సొమ్ము గెలుచుకుంటాడు? అనేది టోటల్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యాక చూడాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xdBl02
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...