Tuesday, 23 November 2021

క్యారవ్యాన్‌లో పూజా హెగ్డే చిందులు.. ఎవ్వరినీ పట్టించుకోవడం లేదుగా!

పూజా హెగ్డే గత కొన్ని రోజులుగా వరుసగా సోషల్ మీడియాను ఊపేస్తోంది. మొన్నటి వరకు మాల్దీవుల్లో సేద తీరి వచ్చింది. బికినీలో అందాలను ఆరబోసి అందరినీ ఆశ్చర్య పరిచింది. మాల్దీవుల్లో బీచ్‌లంటూ దుమ్ములేపేసింది. బికినీ ధరించి ఆమె వేసిన స్టెప్పులు ఇచ్చిన పోజులకు కుర్రకారు ఫిదా అయ్యారు. అయితే తాజాగా పూజా హెగ్డే క్యారవ్యాన్‌లో రచ్చ రచ్చ చేసింది. ఫీవర్ నుంచి పూజా హెగ్డే ఇంకా బయటకు రానట్టు కనిపిస్తోంది. లెహరాయి పాటకు స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకట్టుకుంది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమా ఆహాలో గ్రాండ్ హిట్ అయింది. ఇప్పుడు ఆ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో కూడా అందుబాటులోకి రాబోతోంది. ఈ విషయాన్ని పూజా హెగ్డే చెప్పేసింది. తన క్యారవ్యాన్‌లో లెహరాయి పాటను పెట్టుకుని ఆ మూడ్‌లోనే ఉండిపోయింది.ఎవ్వరినీ పట్టించుకోవడం లేదు.మేకప్ మెన్ వచ్చి హెయిర్ స్ప్రే కొడుతున్నా కూడా డ్యాన్సులు ఆపడం లేదు. మొత్తానికి పూజా హెగ్డే మాత్రం ఇప్పుడు తన కల నెర వేర్చుకుంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పక్కన నటిస్తోంది. ఇది కల నెరవేరిన రోజు అంటూ పూజా హెగ్డే నిన్న ఓ పోస్ట్ చేసింది. కానీ అది ఏ సినిమా? సెట్ ఎక్కడ ఉంది? షూటింగ్ ఎక్కడ జరుగుతోందన్న విషయాలేవీ బయటకు చెప్పలేదు. పూజా హెగ్డే ఇన్ స్టాగ్రాంలో దూసుకుపోతోంది. 16 మిలియన్ల ఫాలోవర్లు రీచ్ అవ్వడంతో పూజా హెగ్డే గాల్లో తేలిపోయింది. తన అభిమానులకు థ్యాంక్స్ చెప్పుకుంది పూజా హెగ్డే. పూజా హెగ్డే ప్రస్తుతం , చిత్రాలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దంగా ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oPHWKx
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...