Tuesday, 23 November 2021

నిక్‌తో ప్రియాంక విడాల‌కుపై స్పందిన త‌ల్లి.. వైర‌ల్ అవుతున్న రియాక్ష‌న్‌

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, అమెరిక‌న్ సింగ‌ర్‌, కంపోజ‌ర్ నిక్ జోన‌స్ నుంచి విడాకులు తీసుకోతుందంటూ సోమ‌వారం వార్త‌లు నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి. అస‌లు ఈ వార్త‌లు పుట్ట‌డానికి కార‌ణ‌మేమంటే.. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పేరుని ప్రియాంక జోన‌స్ నుంచి ప్రియాంక‌గా మార్చుకుంది. దీంతో అందరిలో అనుమానాలు రేకెత్తాయి. లాస్ ఏంజిల్స్‌లో క‌ట్టుకున్న కొత్త ఇంటికి రీసెంట్‌గా ప్రియాంక‌, నిక్ వెళ్లారుగా..అంత‌లో ఏమైంది. ప్రియాంక చోప్రా ఎందుక‌లా చేస్తుంది? అనే ప్ర‌శ్న‌లు అంద‌రినీ వెంటాడాయి. దానికి త‌గిన‌ట్లుగానే సోష‌ల్ మీడియాలో వార్త‌లు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్త‌ల‌పై ప్రియాంక చోప్రా త‌ల్లి మ‌ధు చోప్రా స్పందించారు. ప్రియాంక చోప్రా, నిక్ జోన‌స్‌లు అన్యోన్యంగా ఉన్నార‌ని, వారిద్ద‌రూ విడిపోతున్నారంటూ వినిపిస్తోన్న వార్త‌లను న‌మ్మవ‌ద్ద‌ని అవ‌న్నీ పుకార్లేన‌ని అన్నారు. అంతే కాకుండా స‌ద‌రు అస‌త్య వార్త‌ల‌ను స్ప్రెడ్ చేయ‌వ‌ద్ద‌ని రిక్వెస్ట్ చేశారు. దీంతో నిక్ జోన‌స్‌, ప్రియాంక చోప్రా విడిపోతున్నారంటూ వినిపిస్తోన్న వార్త‌ల‌కు చెక్ ప‌డింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత, నాగ‌ చైత‌న్య‌తో విడిపోయిన సంద‌ర్భంలో జ‌రిగిన‌ట్లుగానే ప్రియాంక జీవితంలోనూ జ‌రుగుతున్నాయ‌ని కూడా వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఏదైతేనేం కూతురి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని మ‌ధు చోప్రా చెప్ప‌డంతో ప్రియాంక చోప్రా ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల‌వుతున్నారు. 2018లో అమెరిక‌న్ సింగ‌ర్‌, కంపోజ‌ర్ నిక్ జోన‌స్‌ను ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకుంది. దాదాపు త‌న‌కంటే 12 ఏళ్లు చిన్న‌వాడైన నిక్‌ను ప్రియాంక పెళ్లి చేసుకుంటుంద‌ని తెలిసి అంద‌రూ షాక‌య్యారు. స‌రే! ల‌వ్ మ్యారేజ్ క‌దా! అని కొంద‌రూ స‌ర్ది చెప్పుకుంటే, కామెంట్స్ చేసిన వారు కూడా ఉన్నారు. అయితే ఇవేమీ ప‌ట్టించుకోకుండా నిక్ జోన‌స్‌, ప్రియాంక చోప్రా 2018లో క్రిస్ట‌య‌న్ ప‌ద్ధ‌తిలో, హిందూ ప‌ద్ధ‌తిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన త‌ర్వాత ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న పేరుని ప్రియాంక జోన‌స్‌గా మార్చుకుంది. ఇప్పుడు తన పేరుని ప్రియాంక చోప్రాగానే మార్చుకుంది. అయితే ప్రియాంక ఎందుకలా చేసిందో ఆమె చెప్పాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nH6sxU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...