Tuesday, 23 November 2021

కైకాల సత్యనారాయణ హెల్త్ అప్‌డేట్.. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కూతురి వివరణ

సీనియర్ నటుడు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని వస్తున్న వార్తలు యావత్ సినీ ప్రేక్షకులను కలవరపెడుతున్నాయి. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని పెద్దఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా కైకాల కూతురు శ్రీమతి రమాదేవి స్పందించారు. తన తండ్రి హెల్త్ కండీషన్ ఎలా ఉందో చెబుతూ తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని అన్నారు. తన తండ్రి కైకాల సత్యనారాయణ గారి ఆరోగ్యం క్రమంగా మెరుగు పడుతోందని, నాన్న గారు నెమ్మదిగా కోలుకుంటున్నారని, బయట షికారు చేస్తున్న రూమర్స్ నమ్మి ఎవరూ ఆందోళన చెందకూడదని చెప్పారు. వైద్యులు అందిస్తున్న చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తోందని, ఆయన అందరితో మాట్లాడుతున్నారని చెప్పారు. తన తండ్రి ఆరోగ్యంపై వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని రమాదేవి తెలిపారు. గత శుక్ర‌వారం ఉద‌యం అనారోగ్యంతో హైద‌రాబాద్‌లోని అపోలో హాస్పిట‌ల్లో జాయిన్ అయ్యారు కైకాల సత్యనారాయణ. డాక్ట‌ర్స్ బృందం స‌త్య‌నారాయ‌ణ ఆరోగ్యంపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టి ఐసీయూలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. రీసెంట్‌గా కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై రియాక్ట్ అయిన చిరంజీవి.. కైకాల స‌త్య‌నారాయ‌ణ‌ గారు స్పృహ‌లోకి వ‌చ్చార‌ని చెప్పారు. కైకాల గారు సంపూర్ణ ఆయురారోగ్యాల‌తో తిరిగి రావాల‌ని ప్రార్థిస్తూ ఆయ‌న అభిమానులు, శ్రేయోభిలాషులంద‌రితో ఈ విష‌యం పంచుకోవ‌డం సంతోషంగా ఉందని అన్నారు. మరోవైపు కైకాల హెల్త్ త్వరగా కుదుటపడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3HMCbWn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...