Tuesday, 23 November 2021

తిప్పగలనా? అంటోన్న సుమ.. నాని సాయం

ప్రస్తుతం వెండితెరపై వెలిగేందుకు మంచి ప్లాన్‌తో వస్తోంది. అంటూ సుమ మెప్పించేందుకు వస్తోంది. అయితే మనకు సుమ అంటే కేవలం పంచ్‌లు, సెటైర్లు మాత్రమే గుర్తుకు వస్తుంటాయి. అలాంటి సుమ సినిమాతో ఎలా మెప్పిస్తుంది.. సీరియస్ కారెక్టర్ ఎలా పోషిస్తుందన్నది చూడాలి. జయమ్మ పంచాయితీ అంటూ ఫస్ట్ లుక్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దీవపాళి సందర్భంగా విడుదల చేశాడు. అది బాగానే వైరల్ అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. నేచురల్ స్టార్ చేతుల మీదుగా సినిమాలోని మొదటి పాటను విడుదల చేయించారు. జయమ్మ పంచాయితీలోని ఫస్ట్ సింగిల్ తిప్పగలనా? అనే పాటను కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఎంఎం కీరవాణి అద్భుతమైన బాణీని అందించగా.. పీవీఎన్ఎస్ రోహిత్ ఆలపించారు. రామాంజనేయులు మంచి సాహిత్యాన్ని రచించారు. సంగీత ప్రియులకు ఈ పాట నచ్చుతుంది. విజువల్స్ అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ పాటలో ఊరు, ఊరిలో పూజారి, ఆ పూాాజారి ప్రేమ కథ కనిపిస్తోంది. ఆ పూజారికి, జయమ్మకు ఉన్న సంబంధం ఏంటి? ఈ ప్రేమ కథకు జయమ్మకు ఏమైనా సంబంధం ఉంటుందా? అనేట్టుగా ఈ పాటగా సాగింది. కీరవాణి మెలోడి ట్యూన్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 2గా రాబోతోన్న ఈ చిత్రాన్ని బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీతో విజయ్ కుమార్ కలివారపు దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. అనుష్ కుమార్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తి కావొస్తుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించబోతోన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nLmBmd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...