Monday, 8 November 2021

‘గాడ్ ఫాద‌ర్‌’లో ఆ క్యారెక్ట‌ర్‌నే లేపేశార‌ట‌.. ఫోక‌స్ అంతా మెగాస్టార్ ఉండ‌టం కోస‌మేనా?

మెగాస్టార్ ‘ఆచార్య‌’ త‌ర్వాత చేస్తున్న సినిమా ‘గాడ్ ఫాద‌ర్‌’. ఇది మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్‌’కు ఇది రీమేక్‌. ఈ సినిమా షూటింగ్ చ‌క చ‌కా జ‌ర‌గుతోంది. పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొంద‌బోయే ఈ చిత్రాన్ని చిరంజీవి ఇమేజ్‌కు, తెలుగు నెటివిటీకి త‌గిన‌ట్లు మార్చి తెర‌కెక్కిస్తున్నారు. స‌త్య‌దేవ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. మోహ‌న్ రాజా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. కాగా సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న లేటెస్ట్ స‌మాచారం మేర‌కు లూసిఫ‌ర్‌లో కీల‌కంగా క‌నిపించ‌బోయే ఓ పాత్ర తెలుగు గాడ్‌ఫాద‌ర్‌లో క‌నిపించ‌ద‌ట‌. ఇంత‌కీ ఆ పాత్ర ఏదో తెలుసా? త‌మ్ముడు పాత్ర‌. మల‌యాళంలో మోహ‌న్‌లాల్ సోద‌రుడు పాత్ర చాలా కీల‌కంగా ఉంటుంది. ఆ పాత్ర‌ధారిని ముఖ్య‌మంత్రి చేయ‌డ‌మే మోహ‌న్‌లాల్ లక్ష్యంగా సినిమాలో క‌నిపిస్తాడు. కానీ తెలుగులో ఆ పాత్ర‌ను పూర్తిగా లేపేశార‌ని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్ ఓ అమేజింగ్ పాత్ర‌లో కనిపించ‌బోతున్నారట‌. ఆ పాత్ర వ్య‌వ‌ధిని మ‌ల‌యాళం కంటే తెలుగులో ఎక్కువ‌గా చేయ‌బోతున్నార‌ట‌. అలాగే ఈ సినిమా క‌థ విష‌యంలో పూరీ జ‌గ‌న్నాథ్‌, డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజాకు త‌న వంతుగా కొన్ని స‌ల‌హాలు సూచ‌న‌లు చేశాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. బ్రిట్నీ స్పియ‌ర్ కూడా ఓ పాట పాడుతుంద‌నే వార్త‌లు కూడా నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. మ‌రో వైపు చిరంజీవి ఆచార్య ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల‌వుతుంది. ఇప్పుడు చిరంజీవి మ‌రో రెండు సినిమాల‌ను స‌మాంత‌రంగా పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఒక‌టి బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రీసెంట్‌గానే స్టార్ట్ చేశారు. అలాగే మెహ‌ర్ ర‌మేశ్ దర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న భోళా శంక‌ర్ మూవీ న‌వంబ‌ర్ 11న లాంఛ‌నంగా ప్రారంభం కావ‌డ‌మే కాకుండా, న‌వంబ‌ర్ 15 నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది. సిస్ట‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా తెర‌కెక్క‌బోయే ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలు పాత్ర‌లో కీర్తిసురేశ్ న‌టిస్తున్నారు.ఈ మూవీలొ చిరు స‌ర‌స‌న మిల్కీబ్యూటీ త‌మ‌న్నా న‌టించ‌నుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BRjmND
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...