Monday, 8 November 2021

Bholaa Shankar : ఫోటో షూట్, లుక్ టెస్ట్ కంప్లీట్.. షూటింగ్ ఎప్పుడంటే?

డైరెక్టర్‌గా ఫాం కోల్పోయి ఎన్నో ఏళ్లు అవుతోంది. షాడో సినిమాతో అతి పెద్ద డిజాస్టర్ ఇచ్చేశాడు మెహర్ రమేష్. మామూలుగా అయితే మెహర్ రమేష్ ఇచ్చింది కూడా అన్నీ డిజాస్టర్లే. ఒక్క బిల్లా మాత్రమే హిట్. అది కూడా ఓ రీమేక్. తమిళంలో హిట్ అయిన కథను తెలుగులో ఎంతో స్టైలీష్‌గా తీశాడు మెహర్ రమేష్. అలా అతని ఖాతాలో ఇంత వరకు సొంత హిట్ అన్నది లేకుండా పోయింది. కంత్రి, శక్తి, షాడో వంటి డిజాస్టర్లతో అందరినీ భయపెట్టేశాడు. అలాంటి డైరెక్టర్‌కు చాన్స్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ సారి కూడా ఓ రీమేక్ కథనే ఎంచుకున్నారు. తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం సినిమాను చిరు ఇప్పుడు భోళా శంకర్‌గా రీమేక్ చేస్తున్నాడు. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రం రాబోతోంది. రాఖీ స్పెషల్, చిరంజీవి బర్త్ డే సందర్భంగా టైటిల్ పోస్టర్, , చిరంజీవి బంధాన్ని తెలియజేసే వీడియోను వదిలారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు మెహర్ రమేష్. నవంబర్ 11న ఉదయం ఏడు గంటల 45 నిమిషాలకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని, నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతోన్నామని ప్రకటించాడు. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/303wFxc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...