Monday, 8 November 2021

Adipurush : ఎప్పటికీ మరిచిపోలేను!.. ‘ఇంద్రజిత్’ కథ ముగిసింది

సినిమా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. స్థాయికి తగ్గట్టుగా ఆది పురుష్ చిత్రాన్ని ఓం రావత్ ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఆది పురుష్ అంటూ రాబోతోన్న ఈ ప్రాజెక్ట్ కథ అందరికీ తెలిసిందే. కానీ విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు వీఎఫ్ఎక్స్ కోసం భారీ ఎత్తున ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది. రాముని వనవాసం, రామ రావణ యుద్దాన్ని చూపించబోతోన్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ మూవీ షూటింగ్ మాత్రం ఇప్పుడు జెట్ స్పీడులో జరుగుతోంది. ఒక్కొక్కరి పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తవుతోంది. ఒక్కొక్కరికీ చిత్రయూనిట్ వీడ్కోలు పలుకుతోంది. అలా ఇప్పటికే రావణ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా కనిపించబోతోన్న సన్నీ సింగ్, రాముడిగా అందిరీన మెప్పించేందుకు వస్తోన్న ప్రభాస్ పాత్రలకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. అయితే తాజాగా ఇంద్రజిత్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందట. ఈ మేరకు కొన్ని ఫోటోలను చిత్రయూనిట్ పంచుకుంది. ఇంద్రజిత్‌గా కనిపించబోతోన్నాడు. తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తవ్వడంతో ఎమోషనల్ అయ్యాడు. నా కెరీర్‌లో ఆది పురుష్ జర్నీ ఎప్పటికీ గుర్తుండిపోతోంది. ప్రభాస్ సర్, సైఫ్ సర్‌తో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది. కృతి సనన్, సన్నీ సింగ్, దేవా భాయ్‌లు మంచి కోస్టార్స్. ఇంద్రజిత్ పాత్రను ఇచ్చినందుకు ఓం రావత్ సర్‌కు థ్యాంక్స్ అంటూ ట్వీట్ వేశాడు. ఇతనికి చిత్రయూనిట్ ఘనంగా వీడ్కోలు పలికింది. ఆది పురుష్ వచ్చే ఏడాది విడుదల కానున్న సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mUtsJk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...