Wednesday, 24 November 2021

మామయ్య కొడుకే కానీ బన్నీని అలా పిలుస్తుంటా.. ఆయనంటే చాలా ఇష్టం! మనసులో మాట చెప్పిన నిహారిక

మెగా డాటర్ సినిమాలతో పెద్దగా సూపర్ డూపర్ హిట్స్ సాధించకపోయినా పాపులారిటీ పరంగా మాత్రం దూసుకుపోయింది. నాగబాబు కూతురుగా తనదైన మాటలు, చాలాకీతనంతో ఫేమస్ అయింది. యాక్టింగ్ విషయంలో పర్వాలేదనిపించుకున్నా ఆమె నటించిన సినిమాలు ఆశించిన ఫలితాన్ని రాబట్టలేదు. మెగా ఫ్యామిలీ మెంబర్‌గా సినీ ఎంట్రీ ఇచ్చిన నిహారిక రీసెంట్‌గా చైతన్యను పెళ్లాడిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా గురించి తన మనసులో మాట బయటపెట్టింది నిహారిక. ఇటీవల టాక్ షోలో పాల్గొన్న నిహారిక.. తన పర్సనల్ విషయాలు మొదలుకొని కెరీర్ సంగతుల వరకు అన్ని విషయాలపై రియాక్ట్ అయింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మామయ్య కొడుకే అయినా.. బన్నీని అన్న అని పిలుస్తుంటా అని నిహారిక చెప్పింది. బన్నీ నటించిన ప్రతి సినిమాలో ఓ వైవిద్యం ఉంటుందని, ఆయన నటించిన అన్ని సినిమాల ఫొటోస్ ఒక్కచోట పెడితే.. ఏది ఏ సినిమాలోదో చెప్పేస్తా అని ఆమె తెలిపింది. సినిమాల్లో లుక్‌ పరంగా బన్నీ చాలా కేర్ తీసుకుంటారని, జులాయి సినిమాలో బన్నీ అన్న అంటే ఇష్టమని నిహారిక చెప్పుకొచ్చింది. ఆలీతో సరదాగా ముచ్చటిస్తూ ఎంజాయ్ చేసింది నిహారిక. కొణిదెల, అల్లు కుటుంబం కాకుండా ఏ హీరో ఇష్టం అని ఆలీ వేసిన ప్రశ్నకు రవితేజ, నాగార్జున అని సమాధానమిచ్చింది నిహారిక. ఇకపోతే పెళ్లి తర్వాత సినీ కెరీర్ కంటిన్యూ చేస్తున్న ఈ మెగా డాటర్ రీసెంట్‌గా 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తెచ్చి పలువురి మన్ననలు అందుకుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nL7EAy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...