Wednesday, 24 November 2021

యాక్సిడెంట్ తర్వాత తొలిసారి స్పందించిన సాయి తేజ్.. వైరల్ అవుతున్న ఆడియో క్లిప్

రీసెంట్‌గా మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ఐకియా సమీపంలో బైక్ మీద నుంచి పడిన సాయి తేజ్.. చాలా రోజుల పాటు కోమాలోనే ఉన్నారు. ప్రత్యేక వైద్యుల సమక్షంలో చికిత్స పొందుతూ మెల్లమెల్లగా కోలుకొని ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే యాక్సిడెంట్ తర్వాత తొలిసారి సాయి తేజ్ తన వాయిస్‌తో ఓ ఆడియో క్లిప్ రిలీజ్ చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన 'రిపబ్లిక్' సినిమా థియేటర్ రన్ ముగియడంతో ఓటీటీపై సందడి చేసేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో మూవీ గురించి మాట్లాడుతూ ఓ ఆడియో మెసేజ్ పంపించారు సాయి తేజ్. ''హాయ్! నేను మీ సాయి ధరమ్ తేజ్. రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిశాక నాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలు, నా కోసం మీరు చేసిన ప్రార్థనలకు కృతజ్ఞతలు. ‘రిపబ్లిక్’ సినిమా మీతో కలిసి చూడటం కుదరలేదు. ‘జీ 5’ ఓటీటీలో నవంబర్ 26న ఈ సినిమా విడుదలవుతోంది. సినిమా చూసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. జై హింద్’’ అని ఆయన అన్నారు. సాయి తేజ్ కీలకపాత్రలో వచ్చిన రిపబ్లిక్ సినిమా ఆశించిన ఫలితం రాబట్టకపోయినా డీసెంట్ రన్ కొనసాగించింది. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, జీ స్టూడియోస్‌ పతాకాలపై భారీ రేంజ్‌లో భగవాన్, జె.పుల్లారావు నిర్మించిన ఈ సినిమాలో సాయి తేజ్ కలెక్టర్ పాత్ర పోషించారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించింది. మరో కీలకపాత్రలో జగపతి బాబు కనిపించారు. మణిశర్మ బాణీలు కట్టారు. సో.. చూడాలి మరి ఓటీటీలో ఈ సినిమాకు ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3FLFStE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...