Wednesday, 24 November 2021

మీమ్స్ క్రియేట్ చేసే వారిపై బ్రహ్మానందం షాకింగ్ కామెంట్స్.. చేతులెత్తి మొక్కుతూ ఆ మాట!!

ఇది మోడ్రన్ యుగం. రోజు రోజుకూ టెక్నాలజీ అంతకంతకూ పెరుగుతూ పోతోంది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఎక్కడా చూసినా స్మార్ట్ యుగం తారసపడుతున్న రోజులివి. ఇక సోషల్ మీడియా అయితే ప్రతి ఒక్కరి అరచేతిలో అలా ఇమిడిపోయింది. స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి రావడంతో ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో గడిపే వారి సంఖ్య పెరిగింది. ఇక ఇదే సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తూ నవ్వించే వారు కూడా ఉన్నారు. తాజాగా అలాంటి వారిపై తనదైన స్టైల్ కామెంట్స్ చేశారు కామెడీ కింగ్ బ్రహ్మి. సోషల్ మీడియాలో మీమ్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేవి . సందర్భానికి తగ్గట్టు ఆయన చూపే హావభావాలతో మీమ్స్ క్రియేట్ చేసి వదులుతుంటారు కొందరు. చూడడానికి నవ్వు తెప్పించడమే గాక ఆ సందర్భాన్ని కళ్ళముందు కదలాడేలా చేస్తుంటాయి మీమ్స్. మరి అలాంటి మీమ్స్ చూసిన బ్రహ్మి ఫీలింగ్స్ ఎలా ఉంటాయనే దానిపై ఫోకస్ పెట్టాడు మరో కమెడియన్ ఆలీ. ఆయన హోస్ట్ చేస్తున్న ప్రోగ్రాంలో ఈ మ్యాటర్ తీయడంతో బ్రహ్మి ఓపెన్ అయ్యారు. నవంబర్ 29న ప్రసారం కాబోతున్న ఆలీతో సరదాగా ప్రోగ్రాం గెస్టుగా వచ్చారు బ్రహ్మానందం. అయితే తాజాగా ఈ షో తాలూకు రెండో ప్రోమో రిలీజ్ చేయగా అందులో మీమ్స్ క్రియేట్ చేసే వారిపై బ్రహ్మానందం చేసిన కామెంట్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ''మీమ్స్ క్రియేట్ చేసే వాళ్లకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. కొన్ని కారణాల వల్ల నేను సినిమాల్లో నటించకపోయినా నన్ను మర్చిపోకుండా చేసేది వాళ్ళే'' అని అన్నారు ఈ కామెడీ బ్రహ్మి. ఇంకా చాలా విషయాలపై ఆయన రియాక్ట్ అయ్యారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CQXUZA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...