Wednesday, 24 November 2021

నాగ చైతన్య అంటే సమంతకు అంత ద్వేషమా.. అందుకే ఇలా చేసిందా? కుక్కతో పోల్చుతూ నెటిజన్ల ట్రోలింగ్

టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ నాగ చైతన్య- విడాకుల వ్యవహారం ఇంకా జనం నోళ్ళలో నానుతూనే ఉంది. వాళ్ళిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించి నెల రోజులు గడిచిపోయినా అందుకు సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ అవుతుండటం చూస్తున్నాం. ప్రతి సందర్భాన్ని, సమంత తన సోషల్ మీడియా ఖాతాలో పెడుతున్న ప్రతి కొటేషన్‌ను చైసామ్ డివోర్స్ ఇష్యూకి ఆపాదించి చూసిన నెటిజన్లు.. ఇప్పుడు అదే సమంతను తెగ ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదండోయ్. ఎవరి లాజిక్ వాళ్ళది అన్నట్లుగా పుట్టినరోజును టార్గెట్ చేసి పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో యమ యాక్టివ్ రోల్ పోషిస్తున్న సమంత.. నిన్న నాగ చైతన్య పుట్టినరోజున మాత్రం సైలెంట్ అయింది. నిజానికి ఈ ఇద్దరూ వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టినా కూడా స్నేహితులుగా కంటిన్యూ అవుతామని చెప్పారు కాబట్టి చైతూకి సమంత విష్ అందుతుందని అంతా భావించారు. కానీ అది జరగలేదు. పైగా తదుపరి రోజే అనగా ఈ రోజు తన పెంపుడు కుక్క హష్‌కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఇన్స్‌స్టా స్టోరీస్ పోస్ట్ చేసింది సమంత. నాగ చైతన్య బర్త్ డేను అస్సలు పట్టించుకోని సామ్.. హష్ బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసినట్టు ఈ పోస్టులు చూస్తుంటే అర్థమవుతోంది. దీంతో ఇది చూసి ఆ కుక్క మీద అంత ప్రేమ కురిపిస్తున్న సమంత.. తన మాజీ భర్తకు ఎందుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని అడుగుతూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. పెంపుడు కుక్కకు అంత ప్రాధాన్యత ఇచ్చే నువ్వు స్నేహితుడని చెప్పిన నాగ చైతన్యను ఎలా మరిచావ్? అంటూ నిలదీస్తున్నారు. నాగ చైతన్య అంటే సమంతకు అంత ద్వేషమా..? అంటూ రెచ్చిపోతున్నారు. ఏదేమైనా హష్ బర్త్ డేతో చై- సామ్ బంధం మరోసారి హాట్ టాపిక్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nMTaA3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...