Thursday, 4 November 2021

‘టైగర్’పై కన్నేసిన హీరోలు.. ఒకే కథతో రవితేజ, బెల్లంకొండ శ్రీనివాస్

ఒక్కోసారి చిత్ర విచిత్ర ఘటనలు జరుగుతుంటాయి. ఒకే కథాంశంతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అలా ఒకే టైంలో ఒకే సారి ఒకే నేపథ్యంతో చిత్రాలు వస్తుంటాయి. అయితే అందులో అనుకుని వచ్చేవి కొన్నిఉంటాయి.. అనుకోకుండా జరిగేవి కొన్ని ఉంటాయి. తాజాగా ఇలానే , బెల్లంకొండ శ్రీనివాస్ ఇద్దరూ కూడా ఒకే కథతో వస్తున్నారు. స్టువర్ట్ పురం దొంగల నేపథ్యంలో సినిమాను తీస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్‌లు వచ్చేశాయి. అంటూ పాన్ ఇండియన్ లెవెల్‌లో రవితేజ రాబోతోన్నాడు. స్టువర్ట్ పురంలో గజదొంగగా పేరు తెచ్చుకున్న టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా ఒకే సారి ఇద్దరు హీరోలు సినిమాలు చేయబోతోన్నారు. ఇది తెలిసి చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా? అన్నది అర్థం కావడం లేదు. నిన్న రవితేజ సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చింది. టైగర్ నాగేశ్వర రావు అనే టైటిల్‌తో రవితేజ రాబోతోండగా.. అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ వస్తున్నారు. ఇవి రెండూ కూడా టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ ఆధారంగా రాబోతోన్నాయి. మరి ఇలా రెండు సినిమాలు ఒకే కథతో వస్తే.. ఎవరు హిట్ కొడతారు.. ఎవరు ఫట్‌మంటారో చూడాలి. కాసేపటి క్రితం విడుదల చేసిన పోస్టర్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌ను చూసి నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి ఈ రెండు సినిమాలు ఎలా ఉంటాయన్నది చూడాలి. ఇందులో రవితేజ పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్నాడు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం టాలీవుడ్ వరకే పరిమితమయ్యేలా ఉన్నాడు. రవితేజ లుక్కును కూడా రివీల్ చేస్తే.. అప్పుడు ఏ ప్రాజెక్ట్ మీద ఎలాంటి బజ్ ఏర్పడుతుందనేది తెలుస్తుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZNnGQO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...