Thursday, 4 November 2021

NBK107 : బాలయ్యకు జోడిగా శ్రుతీ హాసన్.. దారుణమైన ట్రోలింగ్

గత కొన్ని రోజులుగా ఓ వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టేసింది.బాలయ్య సరసన శ్రుతీ హాసన్‌ను తీసుకోబోతోన్నారనే కథనాలు వచ్చాయి. కానీ అవేవీ నిజం కావు అని కొందరు ధృడంగా నమ్మారు. బాలయ్య సరసన నటించేందుకు నో చెప్పిందనే మాట వచ్చింది. అయితే చివరకు నిర్మాతలు అడిగినంత పారితోషికం ఇచ్చేందుకు రెడీ అయినట్టున్నారు. మొత్తానికి బాలయ్య పక్కన శ్రుతీ హాసన్ కనిపించబోతోంది. దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాలో బాలయ్య పక్కన హీరోయిన్‌గా శ్రుతీ హాసన్ కనిపించబోతోంది. అయితే ఈ కాంబినేషన్ సెట్ అవ్వడం వెనకాల దర్శకుడు గోపీచంద్ మలినేని పాత్ర ఎక్కువగా ఉందట. అసలే బలుపు, క్రాక్ వంటి బ్లాక్ బస్టర్లు ఈ ఇద్దరి కాంబోలో వచ్చాయి. అందుకే దర్శకుడి ఒత్తిడి మేరకే ఈ ప్రాజెక్ట్‌లోకి శ్రుతీ హాసన్ వచ్చినట్టు కనిపిస్తోంది. దీపావళి సందర్భంగా ఈ అప్డేట్ ఇచ్చారు మేకర్లు. అయితే నెటిజన్లు మాత్రం ఈ కాంబో మీద సెటైర్లు వేస్తున్నారు. NBK107 ప్రాజెక్ట్‌లోకి శ్రుతీ హాసన్ వచ్చేసిందంటూ ప్రకటించిన ట్వీట్‌పై నెటిజన్లు నానా రకాలుగాకామెంట్లు పెడుతున్నారు. బాలయ్య పక్కన కూతురిగా నటిస్తుందా? డాటర్ రోల్‌కు తీసుకున్నారా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇదెక్కడి కాంబినేషన్ రా బాబు అంటూ తలలు పట్టేసుకుంటున్నారు. మొత్తానికి ఈ ప్రకటనపైనే ఇలాంటి రియాక్షన్లు వస్తుంటే.. రేపు తెరపై ఇంకెలాంటి కామెంట్లు వినిపిస్తాయో చూడాలి. ప్రభాస్ పక్కన సలార్‌తో నటిస్తున్న శ్రుతీ హాసన్ ఇప్పుడు బాలయ్య పక్కన నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3q7Dvx0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...