Thursday, 4 November 2021

Mass MoolaViraat అంటూ రచ్చ.. చిరుతో భారీగా ప్లాన్ చేసిన బాబీ

మెగాస్టార్ ప్రస్తుతం వరుసబెట్టి చిత్రాలను రెడీ చేస్తున్నారు. ఆచార్య చిత్రం పూర్తి అయిపోవడం, ఆ వెంటనే మళ్లీ లూసిఫర్ సినిమా షూటింగ్‌లో బిజీగా మారిపోయాడు. అయితే ఇప్పుడు మరో సినిమాను లాంఛనంగా ప్రారంభించేందుకు రెడీ అయ్యాడు. ఒకే సారి రెండు సినిమాలను చేసేందుకు చిరు ఓకే చెప్పినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎవ్వరూ ఊహించని విధంగా సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను దీపావళి సందర్భంగా విడుదల చేశారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అందులో సినిమాకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. ముహుర్తం, రెగ్యులర్ షూట్‌కు సంబంధించిన వివరాలు ప్రకటించారు. నవంబర్ 6న ఉదయం 11 43 గంటలకు ముహూర్తం, మెగాస్టార్ మాస్ మూలవిరాట్ దర్శనం 12 06గంటలకు అని ప్రకటించారు.దీంతో అభిమానుల్లో ఒక్కసారిగా అంచనాలు పెంచేశాడు. అసలే పూనకాలు లోడింగ్ అంటూ చిరు బర్త్ డేకు వదిలిన పోస్టర్ ఇంకా అందరి మైండ్‌లోంచి పోలేదు. ఇక ఇప్పుడు మరో పోస్టర్‌ను రెడీ చేసినట్టు కనిపిస్తోంది. పూజా కార్యక్రమాలతో ముహుర్తానికి సినిమాను ప్రారంభించి, ఆ కాసేపటి తరువాత అదిరిపోయే పోస్టర్‌‌ను వదలబోతోన్నట్టు కనిపిస్తోంది. దీపావళి సందర్భంగా తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్, అందులో పడవ, జెండా, ఆ జెండా కర్ర ఇలా అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. పోస్టర్లో పడవలు, వాటిపై మన జాతీయ జెండాలను చూస్తుంటే కథ మీద అందరికీ ఆసక్తి పెరుగుతోంది. ఈచిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nVTdZk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...