Saturday, 20 November 2021

నందమూరి ఫ్యాన్స్‌కు ఖుషి కబర్.. ‘అఖండ’ సెన్సార్ పూర్తి

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘అఖండ‌’. నంద‌మూరి అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే సింహా, లెజెండ్ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమా విడుద‌లై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా రాలేదు. అయితే సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు సినిమాను డిసెంబ‌ర్ 2న విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. ఈ న‌వంబ‌ర్ 28న వైజాగ్‌లో అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేశార‌ట‌. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే విడుద‌ల‌వుతుంద‌ని స‌మాచారం. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్, అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచేసింది. తాజా సమాచారం మేరకు ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. సినిమా వ్య‌వ‌ధి 2 గంట‌ల 47 నిమిషాలుగా బోయపాటి ఫిక్స్ చేశాడ‌ట‌. అఖండ‌లో బాల‌య్య‌ను బోయ‌పాటి శ్రీను ఎంత ప‌వ‌ర్‌ఫుల్‌గా చూపిస్తాడ‌నేది అంద‌రిలో క్యూరియాసిటీని పెంచుతోన్న అంశ‌మే. సింహా, లెజెండ్ చిత్రాల త‌రహాలో అఖండ‌లోనూ బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యం చేశారు. ఒక‌టి రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ పాత్ర‌ధారిగా అయితే, మ‌రో రోల్‌.. అఘోరా పాత్ర‌. ఈ రెండు పాత్ర‌ల‌కు సంబంధించిన లుక్స్‌ను కూడా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. శ్రీకాంత్ తొలిసారి బాల‌య్య‌ను ఢీ కొట్టే విల‌న్‌గా కనిపిస్తున్నారు. మైనింగ్ మాఫియాను ఎదిరించే పాత్ర‌లో బాల‌కృష్ణ క‌నిపిస్తార‌ని టీజ‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. ప్ర‌గ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్ పూర్ణ మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. అలాగే సీనియ‌ర్ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు ఇందులో అఘోరా పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌టం గ‌మ‌నార్హం. మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మాత‌గా ద్వారా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా నిర్మితమ‌వుతుంది. అఖండ సినిమా విడుద‌ల కాక మునుపే బాల‌కృష్ణ త‌న 107 సినిమాను స్టార్ట్ చేసేశారు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం భుజానికి జ‌రిగిన ఆప‌రేష‌న్ కార‌ణంగా బాల‌య్య రెస్ట్‌లో ఉన్నారు. సినిమాల‌తో పాటు రీసెంట్‌గా తెలుగు ఓటీటీ మాధ్య‌మ‌మైన ఆహాలో ‘అన్‌స్టాప‌బుల్’ అనే టాక్‌షోకు ఆయ‌న వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన చిత్రీక‌ర‌ణ కొంత మేర‌కు పూర్త‌య్యింది. మిగిలిన చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ షోను బాల‌కృష్ణ హోస్ట్ చేస్తున్న తీరుని అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DCCZLe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...