Sunday, 21 November 2021

చిరంజీవితో రష్మిక మందాన్న!.. ఇది నిజమా? అంటూ నెటిజన్ల సెటైర్లు

మెగాస్టార్ వరుసగా సినిమాలను ఓకే చెప్పేస్తున్నాడు. ఇప్పటికే మూడు నాలుగు ప్రాజెక్ట్‌లు సెట్స్ మీదున్నాయి. అయితే తాజాగా ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. దర్శకత్వంలో ఓ సినిమాకు చిరు ఓకే చెప్పాడనే టాక్ ఆ మధ్య వచ్చింది. అందుకే చిరంజీవిని రెండు మూడు సార్లు ఆ మధ్య కలిసి వచ్చాడట. అయితే తాజాగా ఓ వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరంజీవి చేయబోతోన్నాడని, అందులో హీరోయిన్‌గా ఫిక్స్ అయిందని సమాచారం. అయితే చిరంజీవి ఇప్పుడు ఆచార్య సినిమాను పూర్తి చేశాడు. లూసిఫర్‌ రీమేక్ గాడ్ ఫాదర్‌ను సెట్స్ మీద ఉరకలెత్తిస్తున్నాడు. ఈ మధ్య వేదాళం రీమేక్ అయిన భోళా శంకర్‌ను ప్రారంభించాడు. ఆ తరువాత బాబీ దర్శకత్వంలో రాబోతోన్న సినిమా షూటింగ్‌ను మొదలుపెడతాడు. ఇవన్నీ పూర్తయిన తరువాతే కొత్త సినిమాను మొదలు పెట్టాల్సి ఉంటుంది. అంటే వచ్చే ఏడాది చివర్లో ఇంకో కొత్త సినిమాను చిరు ప్రారంభించే అవకాశం ఉంటుంది. వెంకీ కుడుములతో దాదాపు సినిమా కన్ఫామ్ అయిపోయిందని, అందులో రష్మికను హీరోయిన్‌గా తీసుకున్నాడని తెలుస్తోంది. అయితే ఈ కాంబినేషన్ మీద రూమర్లు రావడంతో నెటిజన్లు నవ్వుకుంటున్నారు. తండ్రీ కూతుళ్లుగా, తాత మనవారిగానా? అంటూ నానా రకాలుగా సెటైర్లు వేస్తున్నారు. చిన్న రూమర్‌గానే ఈ వార్త బయటకు వస్తే ఇలాంటి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. రేపో మాపో అది అఫీషియల్ అని ప్రకటన వస్తే కథ ఎలా ఉంటుందో.. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుందని టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3HHcOoT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...