Sunday, 21 November 2021

GAMANAM : ఎట్టకేలకు మోక్షం.. శ్రియా సరన్‌కు వర్కవుట్ అవుతుందా?

శ్రియా సరన్, ఇలా టాలంటెడ్ యాక్ట్రెస్‌లతో చేస్తోన్న ప్రయోగమే . ఈ చిత్రంతో సినిమాతో సుజనా రావు అనే దర్శకుడు పరిచయం కాబోతోన్నాడు. ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్, శివ కందుకూరి వంటి వారు కూడా నటించారు. అయితే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు మార్లు వాయిదా పడుతూవచ్చింది. అసలు ఈ చిత్రం అంటూ ఒకటి ఉందని కూడా జనాలు మర్చిపోతోన్న సమయంలో తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ముందుగా ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం కేవలం తెలుగు వర్షెన్‌ను మాత్రమే డిసెంబర్ 10న విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఈ చిత్రం శ్రియా సరన్ ఒక కథలో, నిత్యా మీనన్ ఇంకో కథలో, ప్రియాంక జవాల్కర్ మరో కథలో, శివ కందుకూరి ఇంకో కథలో కనిపించబోతోన్నారు. ఇలా మొత్తానికి నాలుగు స్టోరీలు కూడా జనాలకు కనెక్ట్ అయ్యేలానే ఉన్నాయి. అప్పుడెప్పుడో రిలీజ్ చేసిన ట్రైలర్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. శ్రియా సరన్ గెటప్, లుక్స్ అన్నీ కూడా మెప్పించాయి. ఈ చిత్రం హిట్ అయి.. శ్రియాకు మరిన్ని అవకాశాలు ఏమైనా తెచ్చిపెడుతుందేమో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3HIpD2w
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...