Sunday, 21 November 2021

హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న న‌టుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి త‌మ్ముడు

టాలీవుడ్‌లో న‌టుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హీరోలు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు, పొలిటీషియ‌న్స్ గొంతుల‌తో మాట్లాడుతూ ప్రేక్ష‌కుల‌ను ప‌లు వేదిక‌పై న‌వ్వించిన శివారెడ్డి.. సినిమాల్లో క‌మెడియ‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గానూ ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు శివారెడ్డి ఫ్యామిలీ నుంచి ఒక‌రు హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆయనే శివారెడ్డి సోద‌రుడు సంప‌త్‌. ఈయ‌న క‌థానాయ‌కుడిగా రామ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస్ నిర్మిస్తోన్న చిత్రం ‘అర‌ణ్య వాసం’. రాయ‌ల‌సీమ‌లోని ఓ విలేజ్ బ్యాక్‌డ్రాప్ ల‌వ్‌స్టోరి ఇది. ఇప్ప‌టికే తొంబై శాతం చిత్రీక‌ర‌ణ‌ను కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ర‌వి బోయిడ‌పు ప‌నిచేస్తున్నారు. ఇంత‌కు ముందు ర‌వి బోయ‌డ‌పు.. శివ కుమార్.బి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 22 చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు. అంత‌కు ముందు శివ కుమార్.బి డైరెక్ష‌న్‌లోనే రూపొందిన వెబ్ సిరీస్ వ‌ర్క‌వుట్ అయ్యిందికి కూడా వ‌ర్క్ చేశారు. ప్ర‌ముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్ క‌మ‌ల్‌జీత్ నేగి వ‌ద్ద అసిస్టెంట్ కెమెరామెన్‌గా.. విక్కీ డోన‌ర్‌, భూత్‌నాథ్ రిట‌ర్న్స్‌, మ‌ద్రాస్ కేఫ్‌, జాలీ ఎల్ఎల్‌బీ 2, పీకు, గ్ర‌హణ్ చిత్రాల‌తో గుజరాత్ రాష్ట్రంకు సంబంధించిన యాడ్స్‌ను కూడా డైరెక్ట్ చేశారు ర‌వి. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్ హీరోగా చేసిన టైగ‌ర్ జిందా హై, భార‌త్ చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేసిన మార్సిన్ ల‌స్కావెస్ ద‌గ్గ‌ర కూడా కెమెరా డిపార్ట్‌మెంట్‌లో వ‌ర్క్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qTA0KQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...