Sunday, 21 November 2021

సాయి పల్లవి సోదరి సినిమా రెడీ.. పూజా కన్నన్ రచ్చ ఇక షురూ!

సాయి పల్లవికి ఇప్పుడున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.స్టార్ హీరో అయినా సరే సాయి పల్లవికి కోసం ఆగాల్సిందే. సాయి పల్లవికి ఓ కథకు ఓకే చెప్పిందంటేనే అదో విశేషంలా ఉంటుంది. రీమేక్ సినిమా అని చిరంజీవి పక్కన నటించే చాన్స్‌ను కూడా వద్దనుకుంది. ఎన్ని కోట్లు కుమ్మరిస్తామని అన్నా కూడా యాడ్స్‌కు నో చెప్పదు. అందాల ఆరబోతకు నై అంటుంది.అలా తనకంటూ కొన్ని హద్దులు,గీతలు పెట్టుకుంది. అలా అంత నిక్కచ్చిగా ఉంటుంది కాబట్టే సాయి పల్లవికి ఇంత క్రేజ్. అలాంటి సాయి పల్లవి సోదరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేసింది. సాయి పల్లవి, పూజా కన్నన్ ఇద్దరూ కూడా చూసేందుకు ఒకేలా కనిపిస్తూ ఉంటారు. అయితే పూజా కన్నన్ సినీ ఎంట్రీ గురించి ఇది వరకే ఎన్నో వార్తలు వచ్చాయి. తమిళంలో పూజా కన్నన్ ఎంట్రీ ఉండోబోతోందనే వార్తలు హల్చల్ చేశాయి. అయితే తాజాగా పూజా కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. స్టంట్ డైరెక్టర్ సిల్వ దర్శకుడిగా మారి చిత్తారాయి సెవ్వనం అనే సినిమాను తీశాడు. దీంట్లో సముద్రఖని, పూజా కన్నన్ ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా సముద్రఖని, పూజా కన్నన్ మీద పోస్టర్‌ను వదిలారు. అయితే ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి వెళ్లోబోతోంది. డిసెంబర్ 3న జీ5లో ఈ చిత్రం రాబోతోందని ప్రకటించారు. మొత్తానికి సాయి పల్లవిలా పూజా కన్నన్ కూడా అందరినీ మెప్పిస్తుందేమో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30Jd467
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...