Tuesday, 2 November 2021

హాస్పిటల్‌లో చేరిన బాలకృష్ణ.. భుజానికి ఆపరేషన్.. టెన్షన్‌లో ఫ్యాన్స్!

టాలీవుడ్ సీనియర్ అగ్ర కథానాయకుడు నందమూరి బాల‌కృష్ణ సోమవారం హైద‌రాబాద్‌లోని కేర్ హాస్పిట‌ల్‌లో చేరారు. ఆయ‌న కుడి భుజం నొప్పి ఎక్కువ కావ‌డంతో ఆయ‌న హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. కేర్ ఆసుపత్రిలోని డాక్ట‌ర్ ర‌ఘువీర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో వైద్యుల బృందం నాలుగు గంట‌ల పాటు కుడి భుజానికి ఆప‌రేష‌న్‌ను నిర్వ‌హించారు. మంగళవారం సాయంత్రం డాక్టర్స్ ఆయన్ని డిశ్చార్జ్ చేస్తున్నారు. ఆరు వారాల పాటు ఆయ‌న‌కు విశ్రాంతి అవ‌స‌రం అని వైద్యులు సూచించ‌డంతో పాటు నంద‌మూరి అభిమానులు టెన్ష‌న్ ప‌డ‌న‌వ‌ర‌సరం లేద‌ని తెలిపారు. బాలకృష్ణ ఒకవైపు బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ’ సినిమాను పూర్తి చేయగానే తొలిసారి డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. అది కూడా తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో. తన కెరీర్‌లోనే బాలకృష్ణ తొొలిసారి ఓ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ టాక్ షో పేరు ‘అన్ స్టాపబుల్’. రీసెంట్‌గానే ఆ టాక్ షోకు సంబంధించిన ప్రోమో విడుదలై అమేజింగ్ రెస్పాన్స్‌ను రాబట్టకుంది. ఈ షోలో ఇప్పటి వరకు మూడు ఎపిసోడ్స్‌కు సంబంధించిన చిత్రీకరణ పూర్తయ్యింది. మరో రెండు ఎపిసోడ్స్‌లో ప్రభాస్, తారక్ పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. తొలి ఎపిసోడ్‌ను మంచు మోమన్‌బాబు, విష్ణు, లక్ష్మీ ప్రసన్నలపై చిత్రీకరించారు. అందులో బాలయ్య జోష్ చూసిన ప్రేక్షకులు, నందమూరి అభిమానులు ఈ టాక్ షో ద్వారా సరికొత్త బాలకృష్ణను చూడబోతున్నామని భావించారు. మరిప్పుడు డాక్టర్స్ బాలకృష్ణకు ఆరువారాల పాటు రెస్ట్ సూచించారు. మరి ఆహా టాక్ షో అన్ స్టాపబుల్‌ను నిర్వాహకులు ఎలా ముందుకు తీసుకెళతారనేది చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన అఖండ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరి ఈ చిత్రానికి బాలకృష్ణ డబ్బింగ్ పనులు పూర్తి చేశారా? లేక చేయాల్సి ఉందా? అనేది తెలియడం లేదు. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కొత్త సినిమాను నవంబర్‌లోనే ప్రారంభిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బాలకృష్ణ గురించి తెలిసినవాళ్లు మాత్రం ఆయనకు ఇదొక చిన్న బ్రేక్ మాత్రమే. వన్స్ హీ స్టెప్ ఇన్ ఫీల్డ్ స్పీడును తట్టుకోవడం అంత సులభం కాదని అంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nQrZDd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...