Tuesday, 2 November 2021

Rise Of Shyam : అంచనాలు పెంచేసిన నాని

నాచురల్ స్టార్ హీరోగా, టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ కాంబోలో రాబోతోన్న చిత్రం . ఇందులో ముచ్చటగా ముగ్గురు హీరోయిన్లున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు సినిమాకు హైలెట్ అయ్యేలా కనిపిస్తున్నారు. ఇక నాని ద్విపాత్రాభినయం కూడా సినిమాకు కలిసి వచ్చేలా ఉంది. ఇది వరకు వదిలిన పోస్టర్లను గమనిస్తే.. ఇదేదో గతం, పూర్వ జన్మలకు సంబంధించిన కథలా అనిపిస్తోంది.తాజాగా రిలీజ్ చేసిన మరో ప్రోమోతో కథ కొంచెం రివీల్ అయింది. భారీ స్థాయిలో వీఎఫెఎక్స్‌తో రాబోతోన్న ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషల్లో విడుదలవుతోంది. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా.. తెలుగు తమిళ కన్నడ మళయాల భాషల్లో డిసెంబర్ 24న విడుదల కాబోతోంది. ఈక్రమంలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేశారు. రైజ్ ఆఫ్ శ్యామ్.. అతని పాత్ర తీరు తెన్నుల గురించి ఇంట్రడక్షన్ ఇవ్వబోతోన్నారు. నవంబర్ 6న రాబోతోన్న ఈ పాటకు సంబంధించిన ప్రోమను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో 1970, కలకత్తా అని రాసి ఉంది. అంటే ఇందులో శ్యామ్ సింగ రాయ్ గతంలో ఉంటాడన్నమాట. ఇక వాసు పాత్రలో నాని ప్రజెంట్ జనరేష్‌లో కనిపించబోతోన్నట్టున్నాడు. మొత్తానికి రైజ్ ఆఫ్ శ్యామ్ పాటతో కొంత స్టోరీని బయటకు వదిలేలా కనిపిస్తోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్‌పై వెంకట్ బోయనపల్లి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్నారు. మొదటి పాటను కృష్ణకాంత్ రాశారు.. మిక్కీ జే మేయర్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZDSS4V
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...