టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ(86) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పుడు అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. కొన్ని రోజుల ముందు ఆయన ఇంట్లో జారిపడి హాస్పిటల్‌లో చేరారు. ఆరోగ్యం కాస్త కుదుటపడిందని అనుకున్న సమయంలో ఇప్పుడు మళ్లీ మరోసారి ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు కైకా సత్యనారాయణ. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతి నాయకుడిగా, కమెడియన్ ఇలా అన్నీ రకాల ప్రాతలను పోషించి తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. నిర్మాతగానూ సినిమాలు రూపొందించారు. 60 సంవత్సరాలుగా తెలుగు సినిమారంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేశారు. అలాగే హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించారు. ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందారు సత్యనారాయణ. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో ఈయన ఒకరు సత్యనారాయణ. 1996లో మచిలీపట్నం నుంచి తెలుగుదేశం తరపున లోక్‌సభకు ఎన్నికయ్యారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CEWLV0
v
No comments:
Post a Comment